- Telugu News Photo Gallery Cinema photos Will actress Kangana Ranaut say goodbye to films even if she wins the election?
ఎన్నికల్లో గెలిచిన కంగనా రనౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Updated on: Jun 05, 2024 | 6:43 PM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన కంగనా రనౌత్ విజయం సాధించారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే తొలి ప్రయత్నంలోనే కంగనా విజయం సాధించింది.

కొన్నాళ్లుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ల కోసమే మళ్లీ వచ్చేసారు ఎంపీగారు. మరి కంగన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. యాక్చువల్‌గా ఎమర్జెన్సీ సినిమా ఎన్నికలకు ముందే రిలీజ్ కావల్సి ఉంది. ఆ ప్లాన్‌తోనే ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు.

నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను.. వాటివాల్లే నా కెరీర్ ఇలా మారిపోయిందంటూ ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు కంగన రనౌత్. కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనకు కెరీరే లేదనేవాళ్ళున్నారు.




