Prabhas: ప్రభాస్ చేశాడుగా.. మిగిలిన వాళ్లెందుకు చేయట్లేదు మరి ??
ఇండియన్ సినిమాలో ప్రభాస్‌కు మాత్రమే ఆ ప్లానింగ్ సాధ్యమవుతుందా..? ఆయన అంత ఈజీగా చేస్తున్న పనిని మిగిలిన హీరోలెందుకు అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు..? మూడేళ్లకో సినిమా చేయడానికి మిగిలిన హీరోలు కష్టపడుతుంటే.. ప్రభాస్ ఒక్కడే ఏడాదికి మూడు సినిమాలు ఎలా చేస్తున్నారు..? తాజాగా మరో 3 భారీ సినిమాలకు ఓకే చెప్పారీయన. మరి అవేంటి..? ఏం ప్లానింగ్.. ఏం ప్లానింగ్.. చూస్తుంటే ముచ్చటేస్తుందంతే. గత రెండేళ్లుగా ప్రభాస్ పని చేస్తున్న తీరు చూసి ఎవరైనా ఇలాగే అనుకుంటారేమో..?
Updated on: Mar 10, 2024 | 5:58 PM

ఇండియన్ సినిమాలో ప్రభాస్‌కు మాత్రమే ఆ ప్లానింగ్ సాధ్యమవుతుందా..? ఆయన అంత ఈజీగా చేస్తున్న పనిని మిగిలిన హీరోలెందుకు అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు..? మూడేళ్లకో సినిమా చేయడానికి మిగిలిన హీరోలు కష్టపడుతుంటే.. ప్రభాస్ ఒక్కడే ఏడాదికి మూడు సినిమాలు ఎలా చేస్తున్నారు..? తాజాగా మరో 3 భారీ సినిమాలకు ఓకే చెప్పారీయన. మరి అవేంటి..?

ఏం ప్లానింగ్.. ఏం ప్లానింగ్.. చూస్తుంటే ముచ్చటేస్తుందంతే. గత రెండేళ్లుగా ప్రభాస్ పని చేస్తున్న తీరు చూసి ఎవరైనా ఇలాగే అనుకుంటారేమో..? బాహుబలి 2, సాహో మధ్య మూడేళ్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాటిచ్చారు ప్రభాస్. ఎంతైనా రాజు కదా.. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు..!

కరోనా కారణంగా సాహో తర్వాత బ్రేక్ వచ్చినా.. 2022 నుంచి ప్రభాస్ జోరు మామూలుగా లేదు. రాధే శ్యామ్ వచ్చిన ఏడాదిలోపే ఆదిపురుష్‌తో వచ్చారు ప్రభాస్. అది విడుదలైన ఆర్నెళ్లకు సలార్ వచ్చింది. ఇప్పుడు మే 9న కల్కితో రానున్నారు ప్రభాస్. అదొచ్చిన 7 నెలల్లోపే సంక్రాంతికి రాజా సాబ్ అంటూ వచ్చేస్తున్నారు. ఇలా గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నారు రెబల్ స్టార్.

ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నారు. ఇందులో కల్కి 2 భాగాలుగా రాబోతుంది. ఇప్పటికే సెకండ్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు నాగ్ అశ్విన్. మరోవైపు సలార్ 2 షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది. వీటితో పాటు హను రాఘవపూడితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథలో నటించబోతున్నారు ప్రభాస్.

ఒక సినిమా పూర్తయ్యే లోపు.. మరో మూడు సినిమాలు సైన్ చేస్తున్నారు రెబల్ స్టార్. వాటిని అలాగే పూర్తి చేస్తున్నారు కూడా. కల్కి, రాజా సాబ్ కాకుండా.. సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు. 2025 సంక్రాంతికి రాజా సాబ్ వస్తే.. సమ్మర్ తర్వాత సలార్ 2.. 2026 సంక్రాంతికి హను సినిమాలు విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ మిగిలిన హీరోలకు సాధ్యం కావట్లేదు.




