- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Celebrates his Personal Assistance birthday in Thandel set telugu cinema news
Naga Chaitanya: చైతూ మనసు బంగారం.. తండేల్ సెట్లో కేక్ కట్ చేసిన యువసామ్రాట్.. ఎందుకంటే..
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మత్య్సకారుల బ్యా్క్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు.. జాలరి రాజు పాత్రలో చైతూ కనిపించనుండగా..
Updated on: Mar 10, 2024 | 6:02 PM

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

మత్య్సకారుల బ్యా్క్ డ్రాప్ లో ఈ మూవీని రూపొందిస్తున్నరాు. జాలరి రాజు పాత్రలో చైతూ కనిపించనుండగా.. సత్య పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. లవ్ స్టోరీ తర్వాత చైతూ, సాయి పల్లవి మరోసారి వెండితెరపై అందమైన మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు చైతూ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్ వెంకటేశ్ పుట్టిన రోజు వేడుకలను తండేల్ సెట్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. తండేల్ మూవీ సెట్ లో కేక్ కట్ చేసి అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ చందూ కూడా విష్ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వ్యక్తిగత సిబ్బందిని కుటుంబసభ్యులుగా చూసుకుంటున్న చైతూపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కస్టడీ తర్వాత చైతూ నటిస్తున్న సినిమా తండేల్. ఈ మూవీ విషయంలో ముందు నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చైతూ.

ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్ మార్చేశారు. లాంగ్ హెయిర్.. గడ్డం పెంచేసి రగ్గడ్ లుక్ లోకి మారిపోయాడు. ఇందులో సాయి పల్లవి, చైతూ ఇద్దరూ ఢీ గ్లామర్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏడాది దసరాకు అడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చైతూ మనసు బంగారం.. తండేల్ సెట్లో కేక్ కట్ చేసిన యువసామ్రాట్.. ఎందుకంటే..




