- Telugu News Photo Gallery Cinema photos Who Will Replace deepika padukone in kalki 02 Pan Indian Star Hunt Begins
Kalki 02: దీపిక రేంజ్ ఉన్న బ్యూటీ కోసం వేట షురూ
కల్కి 2తో దీపిక పదుకొనేకు బంధం తెగిపోయింది.. ఈ సినిమా నుంచి ఆమెను తప్పించేసారు.. ఇదంతా గతం. మరి ఫ్యూచర్ ఏంటి..? కల్కి 2లో దీపిక ప్లేస్ రీ ప్లేస్ చేసే ఆ హీరోయిన్ ఎవరు..? ఆమె స్థాయిలో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు..? ప్రభాస్ క్రేజ్‌ను మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు..? రేసులో ఎవరు ముందున్నారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?
Updated on: Sep 21, 2025 | 2:38 PM

షూటింగ్ మొదలవ్వక ముందే తమ సినిమా ఈ రేంజ్‌లో ట్రెండ్ అవుతుందని అస్సలు ఊహించి ఉండరు కల్కి 2 మేకర్స్. త్వరలోనే ఈ చిత్ర షూట్ మొదలు కానుంది.. కానీ ఆలోపే దీపికను సినిమా నుంచి తప్పించి బాంబ్ పేల్చారు దర్శక నిర్మాతలు. పైగా జరిగింది నువ్వెలాగూ మార్చలేవు.. కానీ జరగబోయేది నీ చేతుల్లోనే ఉంటుందంటూ పోస్ట్ చేసారు దర్శకుడు నాగీ.

దీపిక పదుకొనేను తీసేసిన తర్వాత కల్కి 2 హీరోయిన్ రేసులో ఎవరెవరు ఉన్నారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. దీపిక రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా.. కానీ ఈమె SSMB29తో బిజీగా ఉన్నారిప్పుడు. సో.. రేస్ నుంచి ప్రియాంక లేనట్లే.

కత్రినా కైఫ్, కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్‌కు అంతగా సూట్ అవ్వరు.. అంటే వాళ్లు కూడా లేనట్లే. సాహోలో నటించిన శ్రద్ధా కపూర్ వైపు నాగీ అడుగులు పడతాయా లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాళ్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే.

అన్నింటికీ మించి హిట్ పెయిర్ కావాలనుకుంటే కల్కి 2 బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వొచ్చు. బాహుబలిని మించిన కథ వస్తే.. ప్రభాస్‌తో నటిస్తానని ఈ మధ్యే చెప్పారు స్వీటీ.కల్కి 2లో దీపిక స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా.. ప్రభాస్ కటౌట్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే.

దీపిక చాలా హైట్.. కాబట్టి నెక్ట్స్ కల్కి 2లోకి ఎంట్రీ ఇవ్వబోయే భామకు ఎత్తు కీలకమే. ప్రస్తుతానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది.




