- Telugu News Photo Gallery Cinema photos Who is the winner among the five movies which will be release on Dasara Festival?
Dasara Movies: దసరా పోరులో ఐదుగురు హీరోలు.. గెలుపు గుర్రం ఎవరిది.?
సంక్రాంతి, వేసవి సీజన్ అయిపొయింది. సంక్రాంతి పోరులో హనుమాన్, వేసవిలో కల్కి తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రాలేదు. మధ్యలో కమిటీ కుర్రోళ్లు, అయ్, మత్తు వదలరా లాంటి కొన్ని చిన్న సినిమాలు హిట్స్ అందుకున్నాయి. ఆగష్టులో వచ్చిన మిస్టర్ బచ్చన్, డబల్ ఇస్మార్ట్ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇక సెప్టెంబర్ చివరిలో 27న ఎన్టీఆర్ దేవర రానుంది. దీని తర్వాత దసరా పండగ సందడి మొదలు కానుంది. మరి దసరా బరిలో ఉన్న సినిమాలు ఏంటి.? విన్నర్ కానున్నది ఎవరు.?
Updated on: Sep 19, 2024 | 3:28 PM

అక్టోబరు తొలి వారం నుంచి మొదలు కానున్నా దసరా సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు ‘శ్వాగ్’తో థియేటర్లలోకి ముందుగా వస్తున్నారు హీరో శ్రీవిష్ణు. ‘సామజవరగమన’, ‘ఓం భీం బుష్’ వంటి హిట్స్ తర్వాత విష్ణు నుంచి వస్తోన్న చిత్రం కావడంతో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రాజ రాజ చోర’ విజయం అందుకుంది. ‘శ్వాగ్’లో రీతు వర్మ ఫీమెల్ లీడ్‌లో నటించింది. ఆడ, మగల ఆధిపత్య పోరు నేపథ్యంలో వినోదాత్మకంగా అక్టోబరు 4న విడుదల కానుంది. మరి చుడాలిక ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ కొడతారా.? లేదా.

హీరో గోపీచంద్ విజయం చూసి చాలాకాలం అయింది. చివరిగా అయన భీమా వచ్చిన ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్, శ్రీను వైట్ల వస్తున్న చిత్రం ‘విశ్వం’. టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న దీనిలో కావ్య థాపర్ హీరోయిన్. గోపీచంద్ శైలి యాక్షన్, పాటు శ్రీను వైట్ల మార్క్ వినోదం కలిపినా కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే రోజు ‘మా నాన్న సూపర్ హీరో’ అంటూ వచ్చేస్తున్నారు సుధీర్‌బాబు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. తండ్రీకొడుకుల ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకొనేలా ఉంది. ఎమోషన్ కూడా ఆకట్టుకుంది. జూన్ నెలలో అయన హీరోగా నటించిన 'హరోం హర' మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ చిత్రంతో సుధీర్ ఈ ఏడాది మరో హిట్ అందుకుంటారా? చుడాలిక..

ఈ ఏడాది ‘అంబాజీ పేట బ్యాండ్’, ‘ప్రసన్న వదనం’ సినిమాలతో విజయాలను అందుకున్న నటుడు సుహాస్ దసరాకి ‘జనక అయితే గనక’తో సిద్ధమవుతున్నారు. ‘బలగం’ సినిమాతో హిట్ ఖాతాలో వేసుకున్న దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఎమోషనల్ కామెడీగా వినూత్నమైన కథతో రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లుతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అక్టోబరు 12న దసరా రోజున రానున్న ఈ చిత్రంతో సుహాస్ ఈ ఏడాది హ్యాట్రిక్ కొడతారా.? లేదో చూడాలి.

తెలుగు నుంచి అగ్రతారలు కనిపించని లోటును తీర్చేందుకు రజనీకాంత్ ‘వేట్టయాన్’తో దసరా బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నారు . ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత తలైవా ‘జై భీమ్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించడం, ఇటీవల విడుదలైన ‘‘మనసిలాయో..’’ పాటలో ముంజు వారియర్, తలైవా స్టెప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరి ఈ ‘వేట్టయాన్’తో రజనీ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారా? లేదా? తెలియాలంటే అక్టోబరు 10 వరకు వేచి చూడాల్సిందే. ‘జై భీమ్’ తరహాలోనే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతుంది.





























