Jr. NTR – Vetrimaran: ఎన్టీఆర్, వెట్రిమారన్ సినిమా సాధ్యమేనా ??
ఎన్టీఆర్ డైరీ మరో మూడేళ్ళ వరకు ఫుల్ బిజీ.. ఇప్పుడీయనతో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా వెయిటింగ్ తప్పదు. ఎందకుంటే అక్కడ కమిట్‌మెంట్స్ అంత పకడ్బందీగా ఉన్నాయి మరి. మరి ఇలాంటి టైమ్‌లో వెట్రిమారన్‌తో తారక్ సినిమా సాధ్యమేనా..? ఒకవేళ ఈయన కథ తీసుకొచ్చినా.. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..? ఇదిగో ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రిమారన్ ట్రెండ్ అయిపోతున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Sep 19, 2024 | 12:14 PM

ఎన్టీఆర్ డైరీ మరో మూడేళ్ళ వరకు ఫుల్ బిజీ.. ఇప్పుడీయనతో సినిమా అంటే ఎంత పెద్ద దర్శకుడికైనా వెయిటింగ్ తప్పదు. ఎందకుంటే అక్కడ కమిట్‌మెంట్స్ అంత పకడ్బందీగా ఉన్నాయి మరి. మరి ఇలాంటి టైమ్‌లో వెట్రిమారన్‌తో తారక్ సినిమా సాధ్యమేనా..? ఒకవేళ ఈయన కథ తీసుకొచ్చినా.. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ సెట్ అవుతుందా..?

ఇదిగో ఎన్టీఆర్ చెప్పిన ఈ ఒక్క మాటతో వెట్రిమారన్ ట్రెండ్ అయిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు సీన్‌లో కూడా లేని వెట్రి.. ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు. దేవర తమిళ ప్రమోషన్స్‌లో తారక్ చెప్పిన ఒక్క మాట వైరల్ అవుతుంది.

నిజానికి ఈ కాంబో ఎప్పుడో సెట్ అయినా.. ఇప్పటికీ సెట్స్‌పైకి అయితే రాలేదు. కరోనా టైమ్‌లోనే ఎన్టీఆర్‌కు కథ చెప్పారు వెట్రిమారన్. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్‌లో తారక్ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ ప్రాజెక్ట్ సెట్టవ్వడం మాత్రం కష్టమే.

ప్రస్తుతం దేవర పార్ట్ 1 అయింది.. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో 2 పార్ట్స్ సినిమా ఒకటి చేస్తున్నారు. వార్ 2 ఎలాగూ ఉండనే ఉంది.ఎన్టీఆర్ కమిటైన సినిమాలన్నీ పూర్తవ్వడానికి కనీసం మూడేళ్లైనా పడుతుంది.

అప్పుడు గానీ ఆయన ఫ్రీ అవ్వరు. అప్పటికి వెట్రిమారన్ కూడా వేరే ప్రాజెక్ట్ ఏం సైన్ చేయకపోతే.. అప్పుడు ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలా అన్నీ సెట్టైతే గానీ.. వెట్రిమారన్, ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి రావడం కష్టమే. చూడాలిక.. ఈ సినిమాకు పరిస్థితులు సహకరిస్తాయో లేదో..?





























