- Telugu News Photo Gallery Cinema photos War Starts between movies which was released on Dasara festival
Dasara Movies: దసరా సినిమాల సమర భేరి మోగింది.. విజయ కేతనాన్ని ఎగురవేసేది ఎవరు..?
మూడు నాలుగు వారాలైపోయింది బాక్సాఫీస్ దగ్గర సందడి లేక..! మధ్యలో మ్యాడ్ కాస్త సౌండ్ చేసినా అది సరిపోలేదు. థియేటర్స్ వరకు ఆడియన్స్‌ను రప్పించే సినిమాలు విడుదలై నెల దాటేసింది. దాంతో దసరాపైనే అందరి ఫోకస్ పడింది. ఈ క్రమంలోనే లియో, భగవంత్ కేసరి బరిలో ముందున్నాయి. మరి వీటిలో దేని రీ సౌండ్ ఎక్కువగా ఉండబోతుందో రిలీజ్ స్టోరీలో చూద్దాం..
Updated on: Oct 19, 2023 | 3:36 PM

మూడు నాలుగు వారాలైపోయింది బాక్సాఫీస్ దగ్గర సందడి లేక..! మధ్యలో మ్యాడ్ కాస్త సౌండ్ చేసినా అది సరిపోలేదు. థియేటర్స్ వరకు ఆడియన్స్‌ను రప్పించే సినిమాలు విడుదలై నెల దాటేసింది. దాంతో దసరాపైనే అందరి ఫోకస్ పడింది. ఈ క్రమంలోనే లియో, భగవంత్ కేసరి బరిలో ముందున్నాయి. మరి వీటిలో దేని రీ సౌండ్ ఎక్కువగా ఉండబోతుందో రిలీజ్ స్టోరీలో చూద్దాం..

దసరా సందడి మొదలైపోయింది. బరిలో రెండు సినిమాలు అక్టోబర్ 19నే రాబోతున్నాయి. ఈ వారం మొత్తం మూడు సినిమాలు వస్తుంటే.. అందులో లియో, భగవంత్ కేసరి ఒకేరోజు రాబోతున్నాయి. ఓ వైపు బాలయ్య.. మరోవైపు విజయ్ ఎవరికి వాళ్లు తగ్గేదే లే అంటున్నారు. రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వీటి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.

అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదే జరిగితే 35 ఏళ్ళ తర్వాత బాలయ్య ఈ ఫీట్ సాధించినట్లు అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా 1345 థియేటర్స్‌కు పైగానే రిలీజ్‌కు రెడీ అయింది భగవంత్ కేసరి. బిజినెస్ కూడా దాదాపు 70 కోట్ల వరకు జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ జోరు చూపిస్తున్నారు బాలయ్య.

మరోవైపు లియోని తక్కువంచనా వేయడానికి లేదు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ 215 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. తెలుగు వర్షన్ వరకు 20 కోట్ల బిజినెస్ చేసింది లియో. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ రిలీజ్ కావడంతో థియేటర్స్ బాగానే దొరికాయి. మొత్తానికి బాలయ్య, విజయ్ మధ్య అక్టోబర్ 19 సమరం ఆసక్తికరంగా ఉండబోతుంది.