- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actor Vishwak Sen Visits Tirumala Srivari Temple Ahead of Laila Movie Release, Photos Here
Tirumala: కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరో.. ఫొటోలు చూశారా?
తమ సినిమా రిలీజ్‌లకు ముందు చాలామంది హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఓ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కాలినడకన తిరుమలకు వచ్చి ఏడుకొండలవాడిని దర్శించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Updated on: Jan 31, 2025 | 7:47 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లైలా. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ శుక్రవారం (జనవరి 31) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న అతను ఏడు కొండల స్వామికి మొక్కులు చెల్లించుకున్నాడు.

ఈ సందర్భంగా భక్తులు, సామాన్యులు విశ్వక్ సేన్ తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విశ్వక్ కూడా ఎంతో ఓపికగా భక్తులతో ఫొటోలు దిగి వారి కళ్లల్లో ఆనందం నింపాడు.

విశ్వక్ సేన్ తిరుమల శ్రీవారి పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

ఇక లైలా సినిమా విషయానికి వస్తే.. ఇందులో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ సోనూ, లైలా అనే పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.




