Naga Chaitanya: తండేల్ లాంటి గొప్ప సినిమాలో పార్ట్ కావడం నా అదృష్టం.. అక్కినేని నాగచైతన్య..
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది.
Updated on: Jan 31, 2025 | 7:38 PM

ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ లాంచ్ వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్. సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అన్నారు.

ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్. లాల్ సింగ్ సినిమా అమీర్ గారితో చేయడం నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆరు నెలల్లో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది.

వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్ కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇలాంటి సినిమాల్లో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ట్రస్ట్ చేసిన అరవింద్ గారికి థాంక్యూ. ఈ లుక్ లోకి ట్రాన్స్ఫర్ కావడానికి ఏడాదిన్నర పట్టింది.

అరవింద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు.

దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జునైద్ సినిమాకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అన్నారు.




