ఓ వైపు పద్దతిగా.. మరో వైపు మోడ్రన్‌గా.. సెగలు రేపుతున్న లవ్లీ బ్యూటీ శాన్వి..
తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పర్లేదు అనిపించుకుంది.తెలుగు ఆడపాదడపా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి కన్నడలో మాత్రం మంచి ఆఫర్స్ వచ్చాయి.
Updated on: Jan 31, 2025 | 1:45 PM

లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ. యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ఈ మూవీ 2012లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో శాన్వి తన నటనతో ఆకట్టుకుంది.

తొలి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆతర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పర్లేదు అనిపించుకుంది.

తెలుగు ఆడపాదడపా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి కన్నడలో మాత్రం మంచి ఆఫర్స్ వచ్చాయి. యష్, దర్శన్, గణేశ్, రక్షిత్ శెట్టి వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే మరాఠీలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉన్న శాన్వి మిగతా భాషలలో మాత్రం సినిమాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది.

హాట్ హాట్ లుక్స్ తో కేకపెట్టిస్తుంది ఈ అమ్మడు. గ్లామర్ గేట్లు ఎత్తేసి కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. శాన్వి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.




