- Telugu News Photo Gallery Cinema photos Vikram's films, which stopped half a decade ago, are about to start again
Vikram: అరదశాబ్ధం కింద ఆగిపోయిన విక్రమ్ సినిమాలకు రెక్కలు.. మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రాలు..
విక్రమ్ పరిస్థితి విచిత్రంగా ఉందిప్పుడు. అసలు ఈయనకు వచ్చిన కష్టం మరే హీరోకు రాకూడదేమో.. అసలే అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం తెలుగులో వెయిట్ చేస్తూనే ఉన్నారీయన. అంతలోనే సరికొత్త కష్టాలు ఈయన్ని వెంటాడుతున్నాయి. దశాబ్ధం, అరదశాబ్ధం కింద ఆగిపోయిన సినిమాలకు ఉన్నట్లుండి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. అసలు విక్రమ్ కెరీర్ విషయంలో ఏం జరుగుతుంది.. అప్పుడెప్పుడో అపరిచితుడు తీసుకొచ్చిన ఇమేజ్‌తో ఇప్పటికీ తెలుగులో దండయాత్ర చేస్తూనే ఉన్నారు విక్రమ్. అయితే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ravi Kiran
Updated on: Sep 26, 2023 | 5:44 PM

విక్రమ్ పరిస్థితి విచిత్రంగా ఉందిప్పుడు. అసలు ఈయనకు వచ్చిన కష్టం మరే హీరోకు రాకూడదేమో.. అసలే అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం తెలుగులో వెయిట్ చేస్తూనే ఉన్నారీయన. అంతలోనే సరికొత్త కష్టాలు ఈయన్ని వెంటాడుతున్నాయి. దశాబ్ధం, అరదశాబ్ధం కింద ఆగిపోయిన సినిమాలకు ఉన్నట్లుండి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. అసలు విక్రమ్ కెరీర్ విషయంలో ఏం జరుగుతుంది..

అప్పుడెప్పుడో అపరిచితుడు తీసుకొచ్చిన ఇమేజ్‌తో ఇప్పటికీ తెలుగులో దండయాత్ర చేస్తూనే ఉన్నారు విక్రమ్. అయితే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అటు ప్రయోగాలు.. ఇటు కమర్షియల్ సినిమాలు.. ఏవీ ఈయనకు కలిసి రావట్లేదు. పొన్నియన్ సెల్వన్ బానే హిట్టైనా అది కేవలం తమిళనాడుకే పరిమితమైంది. తాజాగా ఈయనకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.. ఎప్పుడో ఆగిన సినిమాలు ఇప్పుడొస్తున్నాయి.

పదేళ్ల కింద గౌతమ్ మీనన్, విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటించారు. అయితే అది వర్కవుట్ కాకపోవడంతో.. 2016లో ఇదే సినిమాను విక్రమ్‌తో ధృవ నక్షత్రం పేరుతో మొదలుపెట్టారు.

అయితే అప్పట్నుంచి సెట్స్‌పైనే ఉన్న ఈ చిత్రం ఇన్నాళ్లకు రిలీజ్ కాబోతుంది. నవంబర్ 24న ధృవ నక్షత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు గౌతమ్. మరోవైపు సూర్యపుత్ర కర్ణ పరిస్థితి కూడా ఇంతే.

విక్రమ్ అసలు కర్ణ అనే సినిమా చేస్తున్నట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. ఏడేళ్ల కింద ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో మొదలైంది ఈ చిత్రం. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే ఉన్నట్లుండి ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసారు. అదొస్తున్నట్లు హీరో విక్రమ్‌కు కూడా తెలియదు. ఈ పాత సినిమాలు పక్కనబెడితే ప్రస్తుతం పా రంజిత్‌తో తంగలాన్ సినిమా చేస్తున్నారు విక్రమ్. ఇది త్వరలోనే విడుదల కానుంది.





























