Sreeleela: సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్న శ్రీలీల.. ఆ పాన్ ఇండియా స్టార్ హీరోకి జోడిగా..
శ్రీలీల అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారా.. అదేంటి మొన్నే కదా ఇండస్ట్రీకి వచ్చింది.. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఉంటే అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ఏంటి అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రెండేళ్లుగా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా సెకండ్ రౌండ్ షురూ చేస్తున్నారు. మరి ఈ ముచ్చట్లేంటి.. ఈ రెండో రౌండ్‌లో మొదటి హీరో ఎవరు.. ఇండస్ట్రీకి హీరోయిన్ల కరువు భీభత్సంగా ఉన్న సమయంలో వచ్చారు శ్రీలీల. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ధమాకాతో స్టార్ అయిపోయారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ravi Kiran
Updated on: Sep 26, 2023 | 5:42 PM

శ్రీలీల అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారా.. అదేంటి మొన్నే కదా ఇండస్ట్రీకి వచ్చింది.. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఉంటే అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ఏంటి అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రెండేళ్లుగా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా సెకండ్ రౌండ్ షురూ చేస్తున్నారు. మరి ఈ ముచ్చట్లేంటి.. ఈ రెండో రౌండ్‌లో మొదటి హీరో ఎవరు..

ఇండస్ట్రీకి హీరోయిన్ల కరువు భీభత్సంగా ఉన్న సమయంలో వచ్చారు శ్రీలీల. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ధమాకాతో స్టార్ అయిపోయారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది.

ప్రస్తుతం ఈమె నటించిన స్కంద సెప్టెంబర్ 28న విడుదల కానుంది.. అలాగే అక్టోబర్‌లో భగవంత్ కేసరి.. నవంబర్‌లో ఆదికేశవ.. డిసెంబర్‌లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రానున్నాయి.

రెండేళ్లుగా ఒప్పుకున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు శ్రీలీల. ఈ గ్యాప్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ వదిలేసుకున్నారు కూడా. ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు సినిమాలకు శ్రీలీల డేట్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరితో పాటు రవితేజ కొత్త సినిమాలు కూడా ఈమె డేట్స్ కుదరక వదిలేసినట్లు ప్రచారం జరుగుతుంది.

పాత ప్రాజెక్ట్స్ అన్నీ దాదాపు చివరిదశకు వచ్చేయడంతో.. కొత్త సినిమాలపై ఫోకస్ చేసారు శ్రీలీల. ఈ క్రమంలోనే ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో రాబోతున్న లవ్ స్టోరీలో శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ రౌండ్‌లో మహేష్, పవన్‌లను కవర్ చేసిన శ్రీలీల.. రెండో రౌండ్‌ను ప్రభాస్‌తో మొదలు పెట్టారు. ఈ సారి చరణ్, తారక్, బన్నీతోనూ ఈమె నటిస్తారేమో చూడాలిక.





























