- Telugu News Photo Gallery Cinema photos Vijay samantha, naga chaitanya sai pallavi, chiranjeevi trisha combinations are now trending in social media
రిపీట్ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్లు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న కాంబోలు
కథతో లింక్ ఉన్నప్పుడు కాంబినేషన్లు రిపీట్ కావడం షరా మామూలే. కానీ, ఏమాత్రం కథ కొనసాగకపోయినా... స్క్రీన్ మీద హీరో - హీరోయిన్ల కాంబో కంటిన్యూ అవుతుంటే మాత్రం బిజినెస్ సర్కిల్స్ లో ఓ రకమైన హుషారు కనిపిస్తుంది. అలా ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న కొన్ని కాంబోల గురించి మాట్లాడుకుందాం పదండి.. దళపతి 69మూవీ... అఫిషియల్ అనౌన్స్ రాకముందు నుంచే వైరల్ అవుతోంది.
Updated on: Sep 18, 2024 | 10:01 PM

కథతో లింక్ ఉన్నప్పుడు కాంబినేషన్లు రిపీట్ కావడం షరా మామూలే. కానీ, ఏమాత్రం కథ కొనసాగకపోయినా... స్క్రీన్ మీద హీరో - హీరోయిన్ల కాంబో కంటిన్యూ అవుతుంటే మాత్రం బిజినెస్ సర్కిల్స్ లో ఓ రకమైన హుషారు కనిపిస్తుంది. అలా ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న కొన్ని కాంబోల గురించి మాట్లాడుకుందాం పదండి..

దళపతి 69మూవీ... అఫిషియల్ అనౌన్స్ రాకముందు నుంచే వైరల్ అవుతోంది. విజయ్ ఆఖరి సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తారన్నది లేటెస్ట్ న్యూస్. అయితే విజయ్‌తో త్రిష నటిస్తారని కొంతకాలం, సమంత జోడీ కట్టే ఛాన్స్ ఉందని మరికొంత కాలం ప్రచారం జరిగింది. ఎవరు ఫైనల్ అయినా.. విజయ్‌తో... జోడీ రిపీట్ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్న విషయం.

ధనుష్, నిత్యామీనన్ కాంబినేషన్ ఎంత హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. తిరు మూవీలో ఫ్రెండ్స్ గా, ఆఖరికి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యే జోడీగా వారిద్దరూ చేసిన సందడి అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేదు. ఇద్దరు బెస్ట్ పెర్ఫార్మర్లు స్క్రీన్ షేర్ చేసుకుంటే సీన్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మరో సారి చూడ్డానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్.

తమిళనాటే కాదు, తెలుగులోనూ రిపీటెడ్ కాంబినేషన్లు పలకరించడానికి రెడీ అవుతున్నాయి. విశ్వంభర సినిమాతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు చిరు అండ్ త్రిష. ఆల్రెడీ స్టాలిన్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూశారు ప్రేక్షకులు. మరి విశ్వంభరలో ఏ రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ పండిస్తారో చూడాలనే ఆసక్తి బాగా కనిపిస్తోంది జనాల్లో.

రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయిన సిల్వర్‌స్క్రీన్ పెయిర్ నాగచైతన్య అండ్ సాయిపల్లవి. ఆల్రెడీ లవ్‌స్టోరీతో మెప్పించిన ఈ జోడీ త్వరలోనే తండేల్‌తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాలి తండేల్.




