- Telugu News Photo Gallery Cinema photos Victory Venkatesh In Foot Steps Of Kamal Hasan And Rajinikanth Dark Theme For Saindhav Movie
Saindhav: కమల్ అండ్ రజనీని ఫాలో అవుతున్న విక్టరీ వెంకటేష్.. ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా ??
ట్రెండ్‌ని ఫాలో అయ్యి సినిమాలు తీయడం ఎప్పుడూ జరిగేదే. మేకింగ్ లో ఉన్న సినిమాలకే కాదు, హిట్ అయిన సినిమాలకు కూడా ఓ ట్రెండ్ ఉంటుంది. కొన్ని సీజన్లలో కొన్ని కాన్సెప్టులకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అలా సడన్ హిట్స్ అందుకున్నారు కమల్ అండ్ రజనీ. ఇప్పుడు వీరిద్దరినీ విక్టరీ వెంకటేష్ ఫాలో అవుతారా? కమాన్ లెట్స్ వాచ్.... ఇటు బిగ్‌బాస్, అటు రాజకీయాలంటూ, సినిమాలకు దూరంగా జరిగిన రోజుల్లో, ఫ్లాప్‌లు తప్ప హిట్‌లు పలకరించని సమయంలో కమల్‌కి వచ్చిన హిట్ విక్రమ్.
Updated on: Sep 01, 2023 | 1:37 PM

ట్రెండ్‌ని ఫాలో అయ్యి సినిమాలు తీయడం ఎప్పుడూ జరిగేదే. మేకింగ్ లో ఉన్న సినిమాలకే కాదు, హిట్ అయిన సినిమాలకు కూడా ఓ ట్రెండ్ ఉంటుంది. కొన్ని సీజన్లలో కొన్ని కాన్సెప్టులకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అలా సడన్ హిట్స్ అందుకున్నారు కమల్ అండ్ రజనీ. ఇప్పుడు వీరిద్దరినీ విక్టరీ వెంకటేష్ ఫాలో అవుతారా? కమాన్ లెట్స్ వాచ్....

ఇటు బిగ్‌బాస్, అటు రాజకీయాలంటూ, సినిమాలకు దూరంగా జరిగిన రోజుల్లో, ఫ్లాప్‌లు తప్ప హిట్‌లు పలకరించని సమయంలో కమల్‌కి వచ్చిన హిట్ విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేస్తున్నారన్న మాట తప్ప ఇంకే క్రేజూ లేదు రిలీజ్‌కి ముందు. కానీ ఇప్పుడు విక్రమ్ మూవీ ఓ బ్రాండ్. లోకేష్ యూనివర్శ్‌లో విక్రమ్‌కి స్పెషల్ ప్లేస్ ఉంది. విక్రమ్ సీక్వెల్, రోలెక్స్ మూవీ అంటూ రకరకాల కాన్సెప్టుల కోసం జనాలు కూడా వెయిటింగ్.

బీస్ట్ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన డైరక్టర్ నెల్సన్‌ని నమ్మి సినిమా చేయొద్దని రజనీకాంత్‌కి సలహాలు వచ్చాయట. అయినా డోంట్ కేర్ అంటూ డేరింగ్‌గా స్టెప్ వేశారు రజనీకాంత్. సూపర్‌స్టార్ గట్స్ కి, సన్ పిక్చర్స్ మేకింగ్ తోడైంది. ఇంకేంటి, ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వు కావాలయ్యా అంటున్నారు జనాలు.

600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది జైలర్. తెలుగులోనూ వసూళ్లు అదిరిపోయాయి. అసలు ఏమాత్రం బజ్ లేకుండా రిలీజ్ అయి బొంబాట్ చేసింది జైలర్. కమల్‌కి విక్రమ్ కలిసొచ్చినట్టే, రజనీకి జైలర్ సూపర్ సక్సెస్ అయింది.

కమల్‌నీ, రజనీని ఆదుకున్న డార్క్ కాన్సెప్టు విక్టరీ వెంకటేష్‌కి కూడా హెల్ప్ అవుతుందా? ఆయన నటిస్తున్న సైంధవ్ మూవీని హిట్ ఖాతాలో చేరుస్తుందా? దగ్గుబాటి ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రేపుతున్న విషయం ఇది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది సైంధవ్. ప్రస్తుతం బీదర్ పోర్టులో షూటింగ్‌లో ఉన్నారు వెంకటేష్.




