- Telugu News Photo Gallery Cinema photos Karthikeya Neha Shettys Bedurulanka Movie Tremendous Collections Heart Touching Kushi Movie
హార్ట్ టచింగ్ ఎంటర్‌టైనర్‌గా ఖుషి.. పైసా వసూల్ కలెక్షన్స్ తో బెదురులంక
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి గురించి మాట్లడారు డైరక్టర్ శివ నిర్వాణ. హార్ట్ టచింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తెలిపారు. ఈ సినిమా సరదాగా ఉంటుందని చెప్పారు. ఐదు భాషల్లో ఒకే టైటిల్ ఉంటే బావుంటుందనిపించి, ఖుషి అని పెట్టామని అన్నారు. ప్రేమకథను కొత్తగా చెప్పినట్టు తెలిపారు. బోయ్స్ హాస్టల్ సినిమాకు నెక్స్ట్ లెవల్ రెస్పాన్స్ వస్తోందని అన్నారు మేకర్స్. ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాను పరిచయం చేయడం ఆనందంగా అనిపించిందని చెప్పారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Sep 01, 2023 | 1:39 PM

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి గురించి మాట్లడారు డైరక్టర్ శివ నిర్వాణ. హార్ట్ టచింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్టు తెలిపారు. ఈ సినిమా సరదాగా ఉంటుందని చెప్పారు. ఐదు భాషల్లో ఒకే టైటిల్ ఉంటే బావుంటుందనిపించి, ఖుషి అని పెట్టామని అన్నారు. ప్రేమకథను కొత్తగా చెప్పినట్టు తెలిపారు.

బోయ్స్ హాస్టల్ సినిమాకు నెక్స్ట్ లెవల్ రెస్పాన్స్ వస్తోందని అన్నారు మేకర్స్. ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాను పరిచయం చేయడం ఆనందంగా అనిపించిందని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి బాయ్స్ హాస్టల్‌ని తెలుగులో విడుదల చేశాయి.

కార్తికేయ హీరోగా నటించిన సినిమా బెదురులంక 2012. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిందని ప్రకటించారు మేకర్స్. సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని, ఆదరిస్తున్న ఆడియన్స్ కి థాంక్స్ అని చెప్పారు కార్తికేయ.

ప్రేమదేశపు యువరాణి సినిమాలో నిశ్శబ్దం అంటూ సాగే పాటను సింగర్ సునీత ఆలపించారు. యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. సెప్టెంబర్ 2న విడుదల కానుంది. సునీత పాడిన పాటకు మంచి ఆదరణ లభించిందని చెప్పారు యూనిట్.

రాకింగ్ రాకేష్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. గరుడవేగ అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ సంతోష్‌కుమార్ క్లాప్‌కొట్టారు. ఏపీ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు. మట్టివాసన తెలిపే సినిమాగా తెరకెక్కిస్తున్నామని అన్నారు రాకింగ్ రాకేష్.





























