- Telugu News Photo Gallery Cinema photos Venkatesh Second Daughter Havya Vahini and Doctor Nishanth Marriage Photos Goes Viral telugu cinema news
Venkatesh: సింపుల్గా వెంకటేశ్ రెండో కూతురు హవ్య వాహిని పెళ్లి.. తారల సందడి చూశారా ?..
విక్టరీ వెంకటేశ్ రెండో కూతురు హవ్వ వాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిషాంత్తో జరిగింది. మార్చి 15న శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ లో హవ్యవాహిని.. నిషాంత్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకలలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు.
Updated on: Mar 16, 2024 | 1:26 PM

విక్టరీ వెంకటేశ్ రెండో కూతురు హవ్వ వాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిషాంత్తో జరిగింది. మార్చి 15న శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

గతేడాది అక్టోబర్ లో హవ్యవాహిని.. నిషాంత్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకలలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలలోనూ పలువురు సినీ తారలు హాజరయ్యారు.

గురువారం జరిగిన మెహందీ వేడుకలలో సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత.. కూతురు సితారతో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు నమ్రత.

ఇక శుక్రవారం జరిగిన పెళ్లి వేడుకలలో కోలీవుడ్ స్టార్ కార్తి హాజరైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కార్తి ఫోటోస్ వైరలవుతున్నాయి. అయితే వెంకీ కూతురి వివాహనికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట అంతగా కనిపించడం లేదు.

అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా హవ్య వాహిని, నిషాంత్ వివాహం జరిగింది. వెంకీ, నీరజ దంపతులకు నలుగురు సంతానం. ఆశ్రిత, హవ్య వాహిని, భావనతోపాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్దమ్మాయి ఆశ్రిత వివాహం 2019లో జరిగింది.

సింపుల్గా వెంకటేశ్ రెండో కూతురు హవ్య వాహిని పెళ్లి.. తారల సందడి చూశారా ?..




