- Telugu News Photo Gallery Cinema photos NTR War 2 to Vijay Devarakonda Family Star latest film updates from cinema industry
Movie Updates: ఎన్టీఆర్ 60 రోజులు మాత్రమే.. ఫ్యామిలీ స్టార్ నుంచి క్రేజీ సాంగ్..
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. అల్లరి నరేష్ మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. అంకం మల్లి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తున్నారు అల్లరోడు. నెస్లన్, మమితా బైజు జంటగా నటించిన సినిమా ప్రేమలు. గిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. దేవర సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు.
Updated on: Mar 16, 2024 | 10:22 AM

దేవర సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2లో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. ఎప్రిల్‌లో తారక్ షూటింగ్‌లో జాయిన్ అయి.. జులై లోపు పూర్తి చేయనున్నారు. వార్ 2 కోసం కేవలం 60 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.

అల్లరి నరేష్ మళ్లీ వరస సినిమాలు చేస్తున్నారు. అంకం మల్లి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తున్నారు అల్లరోడు. దీని టీజర్ విడుదలైందిప్పుడు. పెళ్లి కాన్సెప్ట్‌తో వస్తుంది ఆ ఒక్కటి అడక్కు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా సమ్మర్‌లోనే విడుదల కానుంది.

నెస్లన్, మమితా బైజు జంటగా నటించిన సినిమా ప్రేమలు. గిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. మళయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయింది ప్రేమలు. తెలుగులో ఈ సినిమాను శివరాత్రి కానుకగా విడుదల చేస్తే.. ఇక్కడ కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజాగా సినిమా సక్సెస్ మీట్ జరిగింది. దీనికి రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు.

తన రాజకీయ భవిష్యత్తును పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు విజయ్. రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడులో భారీ వర్షాలు కురవగా.. బాధితులకు సాయం చేశారు. బియ్యం సహా నిత్యావసర సరుకులు అందించారు. తాజాగా నడిఘర్ సంఘానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు విజయ్. అందుకు సంబంధించిన చెక్‌ను నడిఘర్ సంఘ సభ్యుడు, హీరో విశాల్‌కు అందచేశారు.

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈ పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమా ఎప్రిల్ 5న విడుదల కానుంది. తన రాజకీయ భవిష్యత్తును పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు విజయ్. రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్నారు.




