- Telugu News Photo Gallery Cinema photos Vaishnavi Chaitanya first movie Baby positive responce as a heroine telugu cinema news
Vaishnavi Chaitanya: తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన తెలుగుమ్మాయి.. వైష్ణవి నటనకు అడియన్స్ ఫిదా..
ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా.. సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తొలిసారి కథానాయికగా సందడి చేసింది తెలుగమ్మాయి వైష్ణవి. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
Updated on: Jul 14, 2023 | 9:11 PM

ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రం బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా.. సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాతో తొలిసారి కథానాయికగా సందడి చేసింది తెలుగమ్మాయి వైష్ణవి. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

యూట్యూబ్ వీడియోస్ నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సహజ నటనతో మెప్పిస్తూ ప్రశంసలు అందుకుంటుంది వైష్ణవి చైతన్య.

హీరోయిన్ కావాలనే ఆశతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. దాదాపు 8 ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నించింది వైష్ణవి.

షార్ట్ ఫిల్మ్, రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈచిన్నది.

ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీగా చెల్లిగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది.

ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీగా చెల్లిగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది.

జూలై 14న విడుదలైన బేబీ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. మనసులను మెలిపెట్టే ప్రేమకథా చిత్రానికి రెస్పాన్స్ ఎక్కువగానే ఉంది.

తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన తెలుగుమ్మాయి.. వైష్ణవి నటనకు అడియన్స్ ఫిదా..





























