- Telugu News Photo Gallery Cinema photos Vaishnav Tej and Sreeleela movie Aadikeshava not getting collections as expected with negative talk
Vaishnav Tej: తస్మాత్ జాగ్రత్త.. వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి..
నేను అనుకోకుండా హీరోను అయ్యాను.. ఊహించని విధంగా సక్సెస్ వచ్చింది.. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు ఇవే. నిజంగానే వైష్ణవ్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు.. నిజానికి మెగా కుటుంబంలోనూ ఎవరూ వైష్ణవ్‌ను హీరోగా చూడలేదు. ఆయన ఇండస్ట్రీకి వస్తాడని కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండానే వచ్చాడు.. ఉప్పెన ఊహించని విధంగా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయింది. ట్రేడ్ కూడా కల కనని విధంగా మొదటి సినిమాతోనే 51 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు వైష్ణవ్ తేజ్.
Praveen Vadla | Edited By: Phani CH
Updated on: Nov 25, 2023 | 7:30 PM

నేను అనుకోకుండా హీరోను అయ్యాను.. ఊహించని విధంగా సక్సెస్ వచ్చింది.. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు ఇవే. నిజంగానే వైష్ణవ్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు.. నిజానికి మెగా కుటుంబంలోనూ ఎవరూ వైష్ణవ్‌ను హీరోగా చూడలేదు. ఆయన ఇండస్ట్రీకి వస్తాడని కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండానే వచ్చాడు.. ఉప్పెన ఊహించని విధంగా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అయింది.

ట్రేడ్ కూడా కల కనని విధంగా మొదటి సినిమాతోనే 51 కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించాడు వైష్ణవ్ తేజ్. అయితే అది మెగా మేనల్లుడి గొప్పతనం అయితే కాదు.. పూర్తిగా దర్శకుడు బుచ్చిబాబు మేనియా. కంటెంట్ బాగుంది కాబట్టి అక్కడున్నది వైష్ణవ్ తేజా ఇంకొకరా అని చూడకుండా ఉప్పెనను ఆదరించారు ఆడియన్స్. మెగా బ్యాగ్రౌండ్ బాగానే హెల్ప్ అయింది కానీ దాన్ని తర్వాత యూజ్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నాడు వైష్ణవ్ తేజ్.

ఉప్పెన తర్వాత మెగా మేనల్లుడి సినిమాలకు ఆదరణ కరువైంది. ఇంకా చెప్పాలంటే కనీసం 10 కోట్లు కూడా రావట్లేదు. కరోనా సమయంలో క్రిష్ తెరకెక్కించిన కొండపొలం విమర్శకుల ప్రశంసల దగ్గరే ఆగిపోతే.. రంగ రంగ వైభవంగా దారుణంగా నిరాశ పరిచింది. పరమ రొటీన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ చిత్రం. ఇక తాజాగా విడుదలైన ఆదికేశవకు రిపోర్ట్స్, రివ్యూలు దారుణంగానే ఉన్నాయి.

ఇన్నేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో కమర్షియల్ మూవీస్ అన్నింటినీ మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో.. అలాగే బయటికి వచ్చింది ఆదికేశవ. ఏ మాత్రం కొత్తదనం లేకుండా ఈ సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. పైగా ఈ సినిమాకు ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడంతో.. మార్నింగ్ షోకే టాక్ బయటికి వచ్చేసింది. 20 ఏళ్ళ నాటి సాంబ సినిమా కథనే మరోసారి తిప్పి తిప్పి తీసాడు దర్శకుడు శ్రీకాంత్.

అసలు కథల ఎంపికలో వైష్ణవ్ తేజ్ ఏ మాత్రం జాగ్రత్తగా లేడు అనే విషయం ఆయన గత సినిమాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఉప్పెన లాంటి జాతీయ అవార్డు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అది గాలివాటమే అని ప్రూవ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఎంచుకుంటున్న కథలలో ఏ మాత్రం కొత్తదనం లేకపోగా.. అసలి ఇవేం సినిమాలు అనిపించేలా ఉన్నాయి.

మాస్ ఇమేజ్ మత్తులో పడి దారుణంగా దారి తప్పుతున్నాడు వైష్ణవ్ తేజ్. ఆదికేశవ చూసాక స్టోరీ సెలక్షన్‌లో వైష్ణవ్ ఎంత వీక్ అనే విషయం అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మెగా అనే బ్రాండ్ తప్పిస్తే.. వైష్ణవ్‌కు సొంత మార్కెట్ అయితే రాలేదు. అది రావాలంటే కచ్చితంగా సొంతంగా హిట్ కొట్టి చూపించాలి. ఎందుకంటే మెగా హీరోల సినిమాలు విడుదలైతే.. టాక్‌తో పనిలేకుండా కచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్లు బాగుంటాయి.. వాటినే ఓపెనింగ్స్ అంటారు.

కానీ వైష్ణవ్ సినిమాలకు అది కనిపించడం లేదు. ఫస్ట్ డే మార్నింగ్ షోకే థియేటర్స్ చాలా వరకు ఖాళీగా కనిపించాయి. దీన్నిబట్టి వైష్ణవ్ రేంజ్ అర్థమైపోతుంది. పైగా ఈ మధ్య మెగా సినిమాలకు కూడా క్రేజ్ బాగా పడిపోయింది. చిరంజీవి భోళా శంకర్, వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున లాంటి సినిమాలకు కూడా కనీసం ఓపెనింగ్స్ రాలేదు. ఇప్పటికైనా వైష్ణవ్ తేజ్ జాగ్రత్త పడకపోతే.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం అయితే పక్కా.





























