- Telugu News Photo Gallery Cinema photos Universal star Kamal Haasan is treading carefully with Thug Life
Thuglife: థగ్ లైఫ్ కోసం కమల్ స్పెషల్ కేర్.. అన్ని విషయాల్లో ఫోకస్..
భారతీయుడు 2 రిజల్ట్ షాక్ ఇవ్వటంతో నెక్ట్స్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగు వేస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. అందుకే మేకింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు ప్రతీ విషయంలోనూ అన్ని తానే అయి చూసుకుంటున్నారు. లోకనాయకుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి.? దీని గురించి ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం..
Updated on: May 13, 2025 | 4:15 PM

గత ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2తో నిరాశపరిచిన కమల్ హాసన్, ఇప్పుడు థగ్ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి ఎలాగైన బిగ్గెస్ట్ హిట్ కొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు లోకనాయకుడు.

38 ఏళ్ల తరువాత కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో థగ్ లైఫ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన థగ్ లైఫ్ టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో ఆ క్రేజ్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు కమల్ హాసన్. థగ్ లైఫ్ సినిమాలో చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్నా... కమల్ స్వయంగా ప్రమోషన్స్ బాధ్యతలు తీసుకుంటున్నారు.

సినిమా రిలీజ్‌కు నెల రోజులు టైమున్నా... ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్పీడు పెంచారు కమల్. వరుస ఇంటర్వ్యూలతో సినిమాను వార్తల్లో ఉంచేందుకు కష్టపడుతున్నారు. శింబు, త్రిష కూడా సినిమాలో నటించినా... తానే ముందుండి ప్రమోషన్స్ చూసుకుంటున్నారు.

భారతీయుడు 2తో ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అందుకే ఆ రిజల్ట్ మరిపించేలా... థగ్ లైఫ్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది కమల్ ప్లాన్. అందుకే అంతా తానే అయి చూసుకుంటున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.




