నా పెరుగన్నంలో అవకాయ నువ్వు అంటూ.. తన భార్యతో ఉన్న ఫొటోస్ షేర్ చేసిన బ్రహ్మాజీ
సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా తన భార్య శాశ్వతికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తన భార్యతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: May 13, 2025 | 4:24 PM

నటుడు బ్రహ్మాజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో ఈయన కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉండటమే కాకుండా ఈ హీరో షోల్లో పాల్గొని సందడి చేస్తుంటాడు.

ఇక రీసెంట్‌గా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బాపు సినిమాతో అభిమానుల మందుకు వచ్చి తన నటనతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈ హీరో తన భార్యతో కలిసి పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు.

అంతే కాకుండా తన భార్య శాశ్వతికి చాలా డిఫరెంట్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. బ్రహ్మాజీ తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ..'నా పెరుగన్నంలో ఆవకాయ నువ్వే.. నా పాలలో డేవిడ్ ఆఫ్ కాఫీ నువ్వే.. నా వోడ్కాలో అల్లం నువ్వే... నా జీవితానికి నవ్వులు నువ్వే.. నన్ను భరిస్తున్నందుకు థాంక్యూ. హ్యాపీ యానివర్సరీ అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక బ్రహ్మాజీ శాశ్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెది బెంగాలీ కాగా, బ్రహ్మాజీది ఆంధ్ర. వీరిద్దరుచాలా అన్యన్యంగా ఉంటారు. ఎప్పుడూ వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు.

Brahmaji 5



