- Telugu News Photo Gallery Cinema photos Mollywood sensation Prithviraj Sukumaran is focusing on Tollywood
Prithviraj Sukumaran: టాలీవుడ్‌పై వరదరాజ్ మన్నార్ ఫోకస్.. పృథ్వీరాజ్ భారీ ప్లాన్..
మాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. త్వరలో తెలుగు తెర మీద తన స్టాంప్ వేయాలని ట్రై చేస్తున్నారు. అదేంటి... పృథ్వీరాజ్ ఆల్రెడీ తెలుగు సినిమాల్లోనూ బిజీగానే ఉన్నారుగా అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్... అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి.
Updated on: May 13, 2025 | 3:40 PM

ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకు రావటంతో పాటు మల్టీ లింగ్యువల్ స్టార్‌గా సౌత్ నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నారు ఈ స్టార్ హీరో.

రీసెంట్‌గా మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నఋ పృథ్వీరాజ్. ఇది లూసిఫెర్ సీక్వెల్‌గా తెరకెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.

ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఈ మలయాళ నటుడు, ఇప్పుడు దర్శకుడిగానూ టాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఓ తెలుగు టాప్ స్టార్ హీరోతో తన డైరెక్షన్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నారు పృథ్వీరాజ్. అయితే ఆ తెలుగు హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సలార్ సినిమా టైమ్‌లో ప్రభాస్‌తో పృథ్వీరాజ్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది. దీంతో డార్లింగ్‌తోనే సినిమా ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

ప్రజెంట్ ఎస్‌ఎస్‌ఎంబీ 29లో మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ మలయాళ స్టార్. మరి ఈ షూటింగ్ టైమ్‌లో మహేష్‌కు కథ వినిపించి ఉంటారా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి. వీళ్లిద్దరు కాక మరో హీరోనైనా ట్రై చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి పృథ్వీరాజ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.




