- Telugu News Photo Gallery Cinema photos Vijay Thalapathy son Jason Sanjay movie in final stages and Release time fixed
Jason Sanjay: చివరి దశకు విజయ్ వారసుడు జాసన్ సినిమా.. రిలీజ్ టైం ఫిక్స్..
విజయ్ సినిమాలకు గుడ్‌బై చెబుతుండటంతో దళపతి అభిమానులను ఎంగేజ్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ వారసుడు జాసన్. విజయ్ ఆఖరి చిత్రం రిలీజ్‌కు ముందే తన సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తన సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు ఈ స్టార్ కిడ్.
Updated on: May 13, 2025 | 3:06 PM

విజయ్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన జాసన్ విజయ్‌ని హీరోగా వెండితెర మీద చూడాలని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ జాసన్ మాత్రం దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్ తనయుడు.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టుగా గత ఏడాది ప్రకటించారు. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ తరువాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అన్న టెన్షన్ ఫ్యాన్స్‌లో కనిపించింది.

ఫైనల్‌గా ఆ సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారు జాసన్. తన డెబ్యూ మూవీ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. హీరో సందీప్ కిషన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో విజయ్ అభిమానుల్లోనూ జోష్ నిపింది.

ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో మిగతా వర్క్ కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు జాసన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ ఏడాది చివర్లో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలన్నది ఈ స్టార్ కిడ్ ప్లాన్.

తండ్రి ఆఖరి సినిమా రిలీజ్ కన్నా ముందే.. తాను ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. మరి చుడాలిక జాసన్ విజయ్ దర్శత్వంలో వస్తున్న తోలి ఎలా ఉండనుందో. ఈ సినిమా హిట్ అయితే అవకాశాలు క్యూ కట్టడం పక్క అంటున్నారు ఫ్యాన్స్.




