- Telugu News Photo Gallery Cinema photos Bollywood actress rhea chakraborty latest cute pics goes viral
Rhea Chakraborty: క్యూట్ క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న కుర్ర భామ రియా చక్రవర్తి
2009లో ఎమ్‌టీవీ ఇండియా షో "TVS స్కూటీ టీన్ దివా"లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది అందాల భామ రియా చక్రవర్తి. . ఆ తర్వాత ఎమ్‌టీవీ డిల్లీలో వీజేగా ఎంపికై, "పెప్సీ ఎమ్‌టీవీ వాసప్", "టిక్‌టాక్ కాలేజ్ బీట్", "ఎమ్‌టీవీ గాన్ ఇన్ 60 సెకండ్స్" వంటి షోలను హోస్ట్ చేసింది.ఇక హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగులో 2012లో తూనీగ తూనీగ సినిమా చేసింది.
Updated on: May 13, 2025 | 2:12 PM

2009లో ఎమ్‌టీవీ ఇండియా షో "TVS స్కూటీ టీన్ దివా"లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది అందాల భామ రియా చక్రవర్తి. . ఆ తర్వాత ఎమ్‌టీవీ డిల్లీలో వీజేగా ఎంపికై, "పెప్సీ ఎమ్‌టీవీ వాసప్", "టిక్‌టాక్ కాలేజ్ బీట్", "ఎమ్‌టీవీ గాన్ ఇన్ 60 సెకండ్స్" వంటి షోలను హోస్ట్ చేసింది.

ఇక హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగులో 2012లో తూనీగ తూనీగ సినిమా చేసింది. ఈ సినిమాలో నిధి పాత్రతో ఆకట్టుకుంది. 2013లో హిందీ చిత్రం మేరె డాడ్ కి మారుతితో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుసగా "సోనాలీ కేబుల్", "బ్యాంక్ చోర్", "హాఫ్ గర్ల్‌ఫ్రెండ్", "జలేబీ" సినిమాల్లో నటించింది.

2020లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా వివాదంలో చిక్కుకుంది. సుశాంత్ మాజీ ప్రియురాలిగా ఆమెపై డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియాను, ఆమె సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేసింది. రియా దాదాపు ఒక నెల బైకుల్లా జైల్లో గడిపింది.

బాంబే హైకోర్టు ఆమెపై డ్రగ్స్ సంబంధిత ఆరోపణలను తిరస్కరించింది. 2024లో సుప్రీంకోర్టు ఆమెపై ఉన్న లుక్‌అవుట్ సర్క్యూలర్‌ను రద్దు చేస్తూ ఊరట కల్పించింది. 2025లో సీబీఐ ఈ కేసును క్లోజ్ చేస్తూ రియాకు క్లీన్ చిట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ చిన్నది అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.




