- Telugu News Photo Gallery Cinema photos Trivikram Srinivas may make multistarrer with Venkatesh, Nani first as Allu Arjun is busy with Pushpa 2 movie
Trivikram: గేమ్ ప్లాన్ చేంజ్ చేసిన గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా ??
ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలుంటుందా లేదా..? సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది.
Updated on: Mar 28, 2024 | 4:14 PM

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలుంటుందా లేదా..?

సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. కానీ త్రివిక్రమ్ మాత్రం నెక్ట్స్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా.. అది ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నా.. మరో ఆర్నెళ్లకు పైగానే పుష్ప 2తో బిజీగా ఉంటారు అల్లు అర్జున్. ఈ లెక్కన అన్ని రోజులు త్రివిక్రమ్ ఆయన కోసమే వేచి చూడాల్సి వస్తుంది.

అందుకే ఈ లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు గురూజీ. దీనికోసమే నాని, రామ్ లాంటి హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాని, వెంకటేష్ మల్టీస్టారర్ ఉంటుందంటున్నారు.

ఇక తమిళ హీరో విజయ్, డివివి దానయ్య కాంబోకు త్రివిక్రమే దర్శకుడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఒకవేళ అల్లు అర్జున్ సినిమా వర్కవుట్ అవ్వకపోతేనే..! ఎందుకంటే అక్కడ అట్లీని లైన్‌లో పెడుతున్నారు ఐకాన్ స్టార్. ఒకవేళ ఆ కాంబో కుదరకపోతే గురూజీ రేసులోకి వస్తారు. అలా కాదంటే మాత్రం త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమాపై ఇంకొన్నాళ్లు ఈ కన్ఫ్యూజన్ తప్పదు.




