- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actor Govinda Returns To Politics, Left Congress Joins In Shiv Sena
Actor Govinda: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఎక్కడినుంచంటే?
90వ దశకంలో స్టార్ హీరోగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పేరు తెచ్చుకున్న గోవిందా చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడాయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీలో చేరారు.
Updated on: Mar 28, 2024 | 10:30 PM

0వ దశకంలో స్టార్ హీరోగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పేరు తెచ్చుకున్న గోవిందా చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడాయన మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ను వీడి మరో పార్టీలో చేరా

గోవింద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ తొలిసారి ప్రధాని అయినప్పుడు గోవింద ఎంపీగా ఎన్నికయ్యారు

అయితే గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన నటుడు గోవింద.. హఠాత్తుగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు.

త కొన్ని రోజులుగా నటుడు గోవింద శివనేస పార్టీకి చెందిన కొందరు నేతలను వరుసగా కలుస్తున్నారు. ఏక్‌నాథ్ షిండేను కూడా కలిసిన ఆయన ఇప్పుడు శివసేన కండువా కప్పుకున్నారు.

శివసేనలో చేరిన అనంతరం గోవింద మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వహిస్తానని గోవింద చెప్పినా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.




