- Telugu News Photo Gallery Cinema photos Neha Shetty Guest Appearence In Siddu Jonnalagadda's Tillu Square Movie telugu movie news
Neha Shetty: రాధిక అక్కా మళ్లీ వచ్చిందిరోయ్.. టిల్లన్నకు షాకిచ్చిన నేహాశెట్టి..
సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఈ మూవీలో సిద్ధూ టిల్లు పాత్రలో కనిపించగా.. నేహా రాధిక పాత్రలో నటించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన డీజే టిల్లు చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకువచ్చారు. అదే టిల్లు స్వ్కేర్. కానీ ఇందులో నేహా శెట్టికి బదులుగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.
Updated on: Mar 29, 2024 | 11:40 AM

సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో నేహా శెట్టి కథానాయికగా నటించింది. ఈ మూవీలో సిద్ధూ టిల్లు పాత్రలో కనిపించగా.. నేహా రాధిక పాత్రలో నటించింది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన డీజే టిల్లు చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకువచ్చారు. అదే టిల్లు స్వ్కేర్. కానీ ఇందులో నేహా శెట్టికి బదులుగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఉదయం నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరోసారి టిల్లన్న మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందని.. దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకులను ఫన్ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమాలో రాధిక గెస్ట్ అప్పీరియన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో మరోసారి రాధిక పాత్రలో నేహాశెట్టి కనిపించిందని వీడియోస్ షేర్ చేస్తున్నారు అడియన్స్.

ఆ వీడియోలో టిల్లు ముందు బ్లాక్ కలర్ పెద్ద కారులో నుంచి రాధిక దిగి వస్తుంది. తన ఎదురుగా రాధికను చూసి షాకయ్యాడు సిద్ధూ. ఈ సన్నివేశం వీడియో ఇప్పుడు వైరలవుతుంది. దీంతో మళ్లీ రాధిక అక్కా వచ్చిందిరోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




