- Telugu News Photo Gallery Cinema photos NTR Fans Worry On Film Updates On Their Hero Birthday, Details Here
Devara: చెర్రీ స్పీడ్ చూసి.. ఫీల్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
బర్త్ డే కి ముందే ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన రామ్ చరణ్ అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఈ స్పీడు చూసిన జూనియర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. చరణ్ ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతుందంటున్నారు అభిమానులు. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 29, 2024 | 1:54 PM

బర్త్ డే కి ముందే ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్స్ ఇచ్చిన రామ్ చరణ్ అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఈ స్పీడు చూసిన జూనియర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త ఫీల్ అవుతున్నారు. చరణ్ ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమాల విషయంలో క్లారిటీ మిస్ అవుతుందంటున్నారు అభిమానులు.

ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది.

కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే వీటిలో ఏ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో అర్ధం కాని పరిస్థితి. దేవరకు సీక్వెల్ ఎనౌన్స్ చేసిన యూనిట్, ఫస్ట్ పార్ట్ పూర్తయిన వెంటనే సీక్వెల్‌ను కూడా పట్టాలెక్కిస్తామని ఎనౌన్స్ చేశారు.

దీంతో ప్రశాంత్ నీల్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ వెనకెళ్లిపోయింది. ఈ గ్యాప్‌ను కవర్ చేయడానికి సలార్ 2ను లైన్‌లోకి తీసుకు వచ్చారు ప్రశాంత్ నీల్. ఆ తరువాత కేజీఎఫ్ 3 ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ సినిమా మరింత ఆలస్యం కానుంది.

దేవర తరువాత వార్ 2 కూడా కంప్లీట్ చేసినా అందులో తారక్ రోల్ ఎంత వరకు ఉంటుందన్నది ఇంకా సస్పెన్సే. అది గెస్ట్ రోల్ మాత్రమే అయితే అభిమానులకు నిరాశ తప్పదు. ఇతర దర్శకులతో చర్చలు జరగుతున్నా.. ఏది అఫీషియల్‌గా ఎనౌన్స్ కాలేదు. దీంతో తారక్ లైనప్ మీద మరింత క్లారిటీ రావాలంటే దేవర రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























