- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood top most trending topics on 24th september Allu arjun to Rashmika Mandanna telugu cinema news
Tollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. టాప్ ట్రెండింగ్ టాపిక్స్ ఇవే.. అల్లు అర్జున్ అలా.. రష్మిక ఇలా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై వెళ్లి అట్లీని కలిసారు, ఈ మధ్యే జవాన్ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నారీయన. తాజాగా బన్నీ, అట్లీ మీటింగ్ ఆసక్తి రేపుతుంది. బన్నీ ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తన తదుపరి సినిమా చర్చించడానికే అట్లీని కలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది.
Updated on: Sep 25, 2023 | 7:12 AM

Allu Arjun: అల్లు అర్జున్ ముంబై జర్నీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై వెళ్లి అట్లీని కలిసారు, ఈ మధ్యే జవాన్ సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నారీయన. తాజాగా బన్నీ, అట్లీ మీటింగ్ ఆసక్తి రేపుతుంది. బన్నీ ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తన తదుపరి సినిమా చర్చించడానికే అట్లీని కలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది.

Papam Pasivadu: పాపం పసివాడు.. ఇండియన్ ఐడల్, ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర నటుడిగానూ బిజీ అవుతున్నారు. ఈయన నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ' పాపం పసివాడు' సెప్టెంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. 5 ఎపిసోడ్‌ల సిరీస్, సెప్టెంబర్ 29న ప్రీమియర్‌గా రాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. దీనికి యూనిట్ సభ్యులు అంతా హాజరయ్యారు.

Nene Naa: నేనే నా.. రెజీనా ప్రధాన పాత్రలో కార్తిక్ రాజ్ తెరకెక్కించిన సినిమా నేనే నా. థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా విడుదలైంది. రెజీనా కసాండ్రా ఇందులో ద్విపాత్రాభినయంలో నటించారు. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన నేనే నా సినిమా ఆగస్ట్ 25న థియేటర్‌లలో విడుదలైంది.

Chandramukhi 2: చంద్రముఖి 2 లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. దీనికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు మేకర్స్.

Animal: యానిమల్ లేడీ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ సినిమా యానిమల్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 1 విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.




