- Telugu News Photo Gallery Cinema photos Actress Pooja Hegde may soon marry famous cricketer rumour making rounds on social media
Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడనున్న పూజా హెగ్డే.. !! అతనెవరంటే..
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే పూజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే గతకొంతకాలంగా ఈ అమ్మడుకి అదృష్టం కలిసి రావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి.
Updated on: Sep 25, 2023 | 1:14 PM

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ప్రస్తుతం అవకాశాలు సన్నగిల్లాయి. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

తక్కువ సమయంలోనే పూజా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే గతకొంతకాలంగా ఈ అమ్మడుకి అదృష్టం కలిసి రావడం లేదు. చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి.

పూజాహెగ్డే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి పేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అంతో ఈ బ్యూటీ కెరీర్ డైలామా లో పడింది.

దానికి తోడు ఇప్పుడు వచ్చిన రెండు బడా సినిమాలను పూజా వదులుకుంది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందుగా ఈ అమ్మడినే హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఈ సినిమానుంచి తప్పుకుంది పూజా. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా..

ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ప్రముఖ క్రికెటర్ తో పూజా పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. నెటిజన్స్ మాత్రం అతడు ఎవరా అని ఆరా తీస్తున్నారు.




