- Telugu News Photo Gallery Cinema photos Interesting news about raghava lawrence and kangana ranaut chandramukhi 2 movie Telugu Entertainment Photos
Chandramukhi – 2: చంద్రముఖి-2 సీక్వెల్ కాదా..? మరి ఇంకేంటి.? ఇంట్రస్టింగ్ న్యూస్..
సిటీలో కంగన ఉంటే, సినిమా న్యూస్ మొత్తం ఆమె చుట్టూ తిరగకుండా ఎలా ఉంటుంది చెప్పండి... అందులోనూ మోస్ట్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ చంద్రముఖి. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఏదైనా ఇట్టే వైరల్ అయిపోతుంది.ఇప్పుడున్న వార్తల ప్రకారం చంద్రముఖి2 పేరుతో తెరకెక్కుతున్నది సీక్వెల్ కాదు. మరి ఇంకేంటి.? వారాయ్ అన్నా, లక లక లక అన్నా వెంటనే మనకు చంద్రముఖి గుర్తుకొచ్చేస్తుంది.
Updated on: Sep 25, 2023 | 1:55 PM

సిటీలో కంగన ఉంటే, సినిమా న్యూస్ మొత్తం ఆమె చుట్టూ తిరగకుండా ఎలా ఉంటుంది చెప్పండి... అందులోనూ మోస్ట్ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ చంద్రముఖి. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఏదైనా ఇట్టే వైరల్ అయిపోతుంది.

ఇప్పుడున్న వార్తల ప్రకారం చంద్రముఖి2 పేరుతో తెరకెక్కుతున్నది సీక్వెల్ కాదు. మరి ఇంకేంటి.? వారాయ్ అన్నా, లక లక లక అన్నా వెంటనే మనకు చంద్రముఖి గుర్తుకొచ్చేస్తుంది. చంద్రముఖి సినిమాలో జ్యోతిక చేసిన కేరక్టర్‌లో చంద్రముఖి2లో కంగన రనౌత్ కనిపిస్తారు.

ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. సెప్టెంబర్ 28న రిలీజ్‌కి రెడీ అవుతున్నది చంద్రముఖి సినిమాకు సీక్వెల్ కాదట చంద్రముఖి 2లో కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

దాన్ని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ చేసుకున్నారట డైరక్టర్ పి.వాసు. గతంలో చంద్రముఖికి సంబంధించిన అన్ని కాన్సెప్టుల్లోనే జస్ట్ ఆత్మ మాత్రమే కనిపించేది. అయితే, లేటెస్ట్ చంద్రముఖిలో అసలు చంద్రముఖి ఎవరు అనే విషయం మీద స్పెషల్‌గా ఫోకస్ చేశారట పి.వాసు.

ఈ లెక్కన చంద్రముఖి2 అనేది గత మూవీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అని అంటున్నారు యూనిట్ మెంబర్స్. చంద్రముఖి2 సినిమా సక్సెస్ కెప్టెన్ పి.వాసుకి మాత్రమే కాదు, అటు కంగనకు, ఇటు లారెన్స్ కి కూడా ఎంతో ఇంపార్టెంట్.

చంద్రముఖి మూవీకంటూ స్పెషల్ అభిమానులున్నారు. వాళ్ల ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయితే మాత్రం సినిమా సూపర్‌డూపర్‌హిట్ కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.





























