- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood Latest Trending Updates Here on 20th July 2023 telugu cinema news
Tollywood: అమెరికాలో ప్రాజెక్ట్ కె సందడి.. రానా బిగ్ అనౌన్స్మెంట్.. లేటేస్ట్ టాలీవుడ్ అప్డేట్స్..
హాలీవుడ్‌లో ప్రాజెక్ట్ కే సందడి గట్టిగా కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానున్న నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ కే టీమ్‌కు వెల్ కం చెబుతూ ర్యాలీలు నిర్వహించారు. కామికాన్ ఇంటర్నేషనల్‌లో టైటిల్ లుక్ రివీల్ కానుంది.
Updated on: Jul 20, 2023 | 6:07 PM

Project K - ప్రాజెక్ట్ కే సందడి.. హాలీవుడ్‌లో ప్రాజెక్ట్ కే సందడి గట్టిగా కనిపిస్తోంది. మరి కొద్ది గంటల్లో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానున్న నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ కే టీమ్‌కు వెల్ కం చెబుతూ ర్యాలీలు నిర్వహించారు. కామికాన్ ఇంటర్నేషనల్‌లో టైటిల్ లుక్ రివీల్ కానుంది.

Deepika - దీపిక హాజరవుతారా? సాండియాగోలో జరుగుతున్న ప్రాజెక్ట్ కే ఈవెంట్‌కు దీపిక దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 'హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్' ఆద్వర్యంలో సమ్మె జరుగుతోంది. ఈ అసోసియేషన్‌లో సభ్యురాలైన దీపిక కూడా సినీ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

Rana - బిగ్ ఎనౌన్స్‌మెంట్స్ కామికాన్ ఇంటర్నేషనల్‌లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్స్ ఇచ్చారు రానా. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న హిరణ్యకశ్యప్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ మిన్నల్ మురళి ఆధారంగా ఓ కామిక్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు.

The Kashmir Files - ది కశ్మీర్ ఫైల్స్ వెబ్ సిరీస్ కశ్మీర్‌లో హిందువులపై జరిగిన హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి రిసెర్చ్ చేసిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, సినిమాలో చూపించలేకపోయిన అంశాలతో వెబ్ సిరీస్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సిరీస్ ది కశ్మీర్ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ పేరుతో త్వరలోనే డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది.

Shahrukh Khan - షారూఖ్ కొరియోగ్రఫీ జవాన్ సినిమా కోసం కొరియోగ్రాఫర్‌గా మారారు హీరో షారూఖ్ ఖాన్. టీజర్ లాస్ట్‌లో వచ్చిన వింటేజ్ సాంగ్ కోసం స్వయంగా స్టెప్స్ కంపోజ్ చేశారు బాద్ షా. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విజయ్ సేతుపతి, నయనతార, దీపిక పదుకోన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




