- Telugu News Photo Gallery Cinema photos Latest Tollywood and Bollywood Updates on 2023 July 20th telugu cinema news
Tollywood : బాలీవుడ్ వైపు అడుగులేస్తోన్న మహానటి.. తాను ‘ఏలియన్’ కాదంటోన్న తాప్సీ..
కీర్తీసురేష్ బాలీవుడ్ డెబ్యూకి రంగం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ ధావన్ యాక్షన్ డ్రామాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ జవాన్ సినిమాతో నయనతారను నార్త్ కి పరిచయం చేస్తున్న అట్లీ, ఇప్పుడు వరుణ్ ధావన్ సినిమాతో కీర్తీ సురేష్‌ని కూడా ఉత్తరాదికి తీసుకెళ్తున్నట్టు టాక్.
Updated on: Jul 20, 2023 | 5:58 PM

Samantha - హీలింగ్ జర్నీ సమంత హీలింగ్ జర్నీ మొదలుపెట్టారు. ఆమె ప్రస్తుతం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో ఉన్నారు. ఒకప్పుడు మెడిటేషన్ చేస్తుంటే రకరకాల ఆలోచనలు వచ్చేవని, అసాధ్యమనిపించేదని అన్నారు. కానీ ఇప్పుడు ధ్యానం మంచి స్ట్రెంగ్త్ ఇస్తోందని తెలిపారు. ప్రపంచంలో విలువైన విషయాలన్నీ ఉచితంగానే లభిస్తాయని చెప్పారు సామ్.

ఏలియన్ కాదు తాప్సీ ఏలియన్‌గా నటిస్తున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. అయితే తాను ఏలియన్‌గా నటించడం లేదని అన్నారు తాప్సీ. ఏలియన్ అనే తమిళ సినిమాలో కీ రోల్ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం షారుఖ్ డంకీ మూవీలోనూ చేస్తున్నట్టు తెలిపారు. నార్త్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ, సౌత్‌లో మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

bro pre release - వేడుకగా బ్రో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'బ్రో'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది 'బ్రో'. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు కమర్షియల్‌గా తెరకెక్కించినట్టు తెలిపారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. పవన్, సాయితేజ్ స్క్రీన్ మీద చేసే సందడి ఆకట్టుకుంటుందని చెప్పారు.

Surya - lokesh - సూపర్ హీరో లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో సూర్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. 'ఇరుంబు కై మాయావి' పేరుతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు లోకేష్ కనగరాజ్. పదేళ్ల ముందే స్క్రిప్ట్ రెడీ చేసినట్టు చెప్పారు. సూర్యతో సూపర్ హీరో సినిమా చేయడం తన కల అని అన్నారు లోకేష్.

Keerthy - varun - రూట్ క్లియర్ కీర్తీసురేష్ బాలీవుడ్ డెబ్యూకి రంగం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ ధావన్ యాక్షన్ డ్రామాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ జవాన్ సినిమాతో నయనతారను నార్త్ కి పరిచయం చేస్తున్న అట్లీ, ఇప్పుడు వరుణ్ ధావన్ సినిమాతో కీర్తీ సురేష్‌ని కూడా ఉత్తరాదికి తీసుకెళ్తున్నట్టు టాక్.




