- Telugu News Photo Gallery Cinema photos Sithara entertainments entering into distribution field and Tollywood latest updates
Tollywood: ఆ రంగంలోకి అడుగు పెట్టిన సితార ఎంటర్‌టైన్మెంట్స్.. టాలీవుడ్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్..
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ కూడా ఒకటి. ఇందులో కనీసం ఎప్పుడూ అరడజన్ సినిమాలు లైన్‌లో ఉంటాయి. ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇంత బిజీగా ఉన్న ఈ నిర్మాత.. డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగు పెట్టారు...
Updated on: Jul 21, 2023 | 2:13 PM

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ తెరకెక్కిస్తున్న సినిమా బెదురులంక 2012. ఆగస్ట్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే రిలీజ్ డేట్‌పై చేసిన వీడియోకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సొల్లుడా శివ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా చిత్రం బ్రో. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బ్రో సినిమా వస్తుంది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ ఫీమేల్ లీడ్ చేస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డైలాగ్ కింగ్ సాయి కుమార్, రాజీవ్ కనకాల, ఆదిత్య ఓమ్ ప్రధాన పాత్రల్లో జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ తెరకెక్కించిన నాతో నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా జులై 21న ఆడియన్స్ ముందుకు రానుంది. ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు శాంతి కుమార్. బలగం వేణు తర్వాత జబర్దస్త్ నుంచి ఇదే ఏడాది మెగాఫోన్ పట్టిన మరో కమెడియన్ ఈయన.

రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకొనే, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. టీజర్ జులై 20న అమెరికాలో విడుదల కానుంది. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం చిత్రయూనిట్ అంతా ఇప్పటికే యుఎస్ చేరుకున్నారు. మార్వెల్ మేకర్స్‌తో కలిసి ప్రాజెక్ట్ K సినిమా ప్రపంచ ముందుకొస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌజ్‌లలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ కూడా ఒకటి. ఇందులో కనీసం ఎప్పుడూ అరడజన్ సినిమాలు లైన్‌లో ఉంటాయి. ఏడాదికి నాలుగు సినిమాలు విడుదల చేస్తుంటారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇంత బిజీగా ఉన్న ఈ నిర్మాత.. డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగు పెట్టారు. తొలి ప్రయత్నంగా లియో సినిమా తెలుగు హక్కులు చేజిక్కించుకున్నారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.




