- Telugu News Photo Gallery Cinema photos There is a lot of interest on whether BRO movie ticket prices will increase in Andhra Pradesh or Not
BRO Movie: ఏపీలో బ్రో సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా.. లేదా.? ఇప్పుడిదే చర్చ..
బ్రో సినిమాకు ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారా..? సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే తెలంగాణలో ఏమో కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు కాస్త వేడెక్కుతాయి. టికెట్ రేట్ల నుంచి మొదలు పెడితే చాలా ఇష్యూస్ సినిమాతో ముడిపడతాయి. మరి ఇప్పుడు బ్రో పరిస్థితి ఎలా ఉండబోతుంది..?
Updated on: Jul 20, 2023 | 8:42 PM

బ్రో సినిమాకు ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారా..? సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే తెలంగాణలో ఏమో కానీ ఏపీలో మాత్రం పరిస్థితులు కాస్త వేడెక్కుతాయి. టికెట్ రేట్ల నుంచి మొదలు పెడితే చాలా ఇష్యూస్ సినిమాతో ముడిపడతాయి. మరి ఇప్పుడు బ్రో పరిస్థితి ఎలా ఉండబోతుంది..? టికెట్ రేట్లు పెంచేస్తున్నారా.. అసలు దీనికి నిర్మాత ఏమంటున్నారు..?

ఓ భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే.. ఎలా ఉంది అని అడగడం కాదు టికెట్ రేట్ ఎంత పెంచారని ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ మధ్య ప్రతీ పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది మామూలు మ్యాటర్ అయిపోయింది. కానీ అదేంటో కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. తాజాగా బ్రో సినిమాకు కూడా రేట్లు పెరగడం లేదు.


నాని లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలకే కనీసం వారం రోజులు రేట్లు పెంచుకుంటున్నారు.. అలాంటిది పవన్ సినిమాకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పైగా బ్రో సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ కూడా ఉండబోవని తెలిపారు విశ్వప్రసాద్. ఈ చిత్ర ట్రైలర్‌ను జులై 21న విడుదల చేయనున్నారు. ఇందులో వింటేజ్ పవన్ లుక్స్ హైలైట్ చేయనున్నారు దర్శకుడు సముద్రఖని.

టికెట్ రేట్లు పెంచడం లేదు గనుక తెలంగాణలో ప్రభుత్వం అనుమతినిచ్చి 295 రూపాయలు అందుబాటులోకి రానుంది. అలాగే సింగిల్ స్క్రీన్స్ 175 రూపాయలుగా ఉండబోతుంది. ఇక ఏపీలో 177 రూపాయల టికెట్‌తో రానుంది బ్రో. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో అంచనాలు పెరిగాయి. మొత్తానికి చూడాలిక.. రెగ్యులర్ టికెట్ రేట్లు, వితౌట్ బెనిఫిట్ షోస్‌తో బ్రో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో..?





























