టాలీవుడ్‌లో హీరోల రేంజ్ మాత్రమే కాదు దర్శకుల రేంజ్ కూడా మారిపోయింది. అందుకే వాళ్లు కూడా గ్యాప్ తీసుకుని వస్తున్నారు. హీరోలు ఎలాగైతే ఒక్కో సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటున్నారో.. డైరెక్టర్స్ అదే రూట్ ఫాలో అవుతున్నారు. అలా 2023లో కొరటాల, రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు కనిపించడం లేదు.. వాళ్ల నుంచి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రావట్లేదు.