- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu starrer Srimanthudu has got 200 million views on YouTube
Mahesh Babu: మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఘనత సాధించిన ఏకైక తెలుగు హీరోగా సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు మహేష్ బాబు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Updated on: Sep 08, 2023 | 1:45 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు మహేష్ బాబు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే మహేష్ బాబు తాజాగా ఓ రికార్డ్ ను క్రియాట్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మారే హీరోకు సాధ్యం కానీ రికార్డ్ ను మహేష్ తన ఖాతాలో వేసుకున్నారు. అదికూడా లేటెస్ట్ మూవీతో కాదు గతంలో ఆయన నటించిన సినిమాతో రికార్డ్ క్రియేట్ చేశారు మహేష్.

మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. ఊరిని దత్తత్ తీసుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.

తాజాగా ఈ సినిమా యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీమంతుడు సినిమా యూట్యూబ్ లో ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఇంతవరకు ఈ టాలీవుడ్ సినిమా ఈ రికార్డ్ ను క్రియేట్ చేయలేదు, మహేష్ సినిమా కు ఇప్పుడు ఈ రికార్డ్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.




