పఠాన్‌కు ముందు రెండేళ్ల పాటు బాలీవుడ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. మళ్లీ షారుక్ ఫామ్‌లోకి వచ్చాకే.. నార్త్ ఇండస్ట్రీ కూడా ఫామ్‌లోకి వచ్చింది. పఠాన్ తర్వాత కేరళ స్టోరీ, తూ జూటీ మై ముక్కర్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, గదర్ 2 లాంటి సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు ఈ జోష్ డబుల్ చేస్తూ జవాన్ వచ్చేసింది. దీనికి కూడా అదిరిపోయే టాక్ వచ్చింది.. మరో 1000 కోట్లు లోడింగ్ అంటుంది ట్రేడ్.