- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like vishwambhara, kingdom, Sambarala Yeti Gattu movies shooting updates on 04 03 2025
Tollywood News: మండే ఎండల్లోనూ తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ స్టార్ హీరోస్
మండే ఎండలు మండుతూనే ఉన్నాయి. కానీ మన హీరోలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. షూటింగ్స్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. చిరంజీవి నుంచి మొదలుపెట్టి.. ప్రతీ హీరో షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నాడు..? ఎవరు ఏ సినిమాతో బిజీగా ఉన్నారో చూద్దాం పదండి..
Updated on: Mar 04, 2025 | 9:15 PM

మండే ఎండలు మండుతూనే ఉన్నాయి. కానీ మన హీరోలు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. షూటింగ్స్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. చిరంజీవి నుంచి మొదలుపెట్టి.. ప్రతీ హీరో షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నాడు..? ఎవరు ఏ సినిమాతో బిజీగా ఉన్నారో చూద్దాం పదండి..

చిరంజీవి, వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం హేలో నేటివ్ స్టూడియోలో జరుగుతుంది. అక్కడే సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న షూట్ కూడా జరుగుతుంది.

ఇక రవితేజ మాస్ జాతర.. సంపత్ నంది, శర్వానంద్ సినిమాల సెట్ వర్క్ ఇదే స్టూడియోలో జరుగతున్నాయి. ప్రభాస్ ఇటు రాజా సాబ్.. అటు ఫౌజీ సినిమాలకు డేట్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న కింగ్ డమ్ చిత్ర షూటింగ్ పఠాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా.. రామ్ పోతినేని, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా షూట్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టులోని కీలక సన్నివేశాల చిత్రీకరణ తుక్కుగూడలో జరుగుతుంది. నిఖిల్ పీరియడ్ వార్ డ్రామా స్వయంభూ షూట్ జన్వాడలో.. తేజా సజ్జా మిరాయ్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో.. సుధా కొంగర తెరకెక్కిస్తున్న తమిళ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.