- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies like the raja saab kantara 2 Vishwambhara going to release this dussehra 2025
సమ్మర్ వద్దు.. మాకు ఆ సీజనే ముద్దు అంటున్న హీరోస్
సమ్మర్ బరిలో దిగుతారనుకున్న స్టార్లందరూ కూసింత గ్యాప్ తీసుకుని దసరాకి ధూమ్ ధామ్ చేయడానికి ఫిక్సయిపోయినట్టున్నారు. ఆల్రెడీ ఆ సీజన్ మీద ఖర్చీఫ్ వేసిన సినిమాలే కాదు.. సమ్మర్ నుంచి షిఫ్ట్ అయిన సినిమాలతో కళకళలాడనుంది అక్టోబర్! సమ్మర్‌ని వదిలేసిన ప్రభాస్.. మేలో ట్రైలర్‌తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
Updated on: May 01, 2025 | 5:07 PM

సమ్మర్ బరిలో దిగుతారనుకున్న స్టార్లందరూ కూసింత గ్యాప్ తీసుకుని దసరాకి ధూమ్ ధామ్ చేయడానికి ఫిక్సయిపోయినట్టున్నారు. ఆల్రెడీ ఆ సీజన్ మీద ఖర్చీఫ్ వేసిన సినిమాలే కాదు.. సమ్మర్ నుంచి షిఫ్ట్ అయిన సినిమాలతో కళకళలాడనుంది అక్టోబర్!

సమ్మర్‌ని వదిలేసిన ప్రభాస్.. మేలో ట్రైలర్‌తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు, ది రాజాసాబ్‌ని దసరా బరిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సమ్మర్‌కి ట్రైలర్ పండగ.. అక్టోబర్‌లో అసలు పండగ అని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్..

ఇటు సంక్రాంతికి పండగ చేసుకోవాల్సిన మెగాభిమానులు కూడా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే జులైలో సినిమా థియేటర్లలోకి రావడం పక్కా అన్న న్యూస్ వినిపిస్తోంది. ఒకవేళ మెగాస్టార్ ఇంకాస్త టైమ్ తీసుకుంటే మాత్రం అక్టోబర్‌లో పక్కా అనే టాక్ మొదలైంది ఫిల్మ్ నగర్‌లో.

వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఘాటీ వాయిదా పడిందన్నది ఇండస్ట్రీ మాట. ఈ సినిమాను కూడా దసరా బరిలోనే దించుతారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్వీటీ సినిమా ఎప్పుడొచ్చినా మాకు పండగే.. అంటున్నారు ఫ్యాన్స్.

చెప్పిన టైమ్‌కి పక్కాగా వచ్చి తీరుతామని ఆల్రెడీ డిక్లేర్ చేసింది కాంతార చాప్టర్ ఒన్ టీమ్. ఈ సారి కొడితే మామూలుగా ఉండదు. ఆస్కార్ మరోసారి మన వైపు చూడాల్సిందేననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కాంతార టీమ్‌లో. ధనుష్ ఇడ్లీ కడై కూడా ఈ సీజన్‌నే ఫోకస్ చేస్తోంది. సో.. ఇన్ని సినిమాలతో ఈ దసరా మారుమోగడం గ్యారంటీ అన్నమాట.




