- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroins like keerthy suresh Nabha Natesh meenakshi chaudhary Use Social Media for Career Growth
సినిమా ఆఫర్స్ లేక.. గ్లామర్ షో సోషల్ మీడియాకే అంకితం చేస్తున్న ముద్దుగుమ్మలు
అందంగా ఉండటం వేరు.. అదృష్టం ఉండటం వేరు..! బ్యూటీఫుల్ గాల్స్ అందరికీ లక్ ఫుల్లుగా ఉంటుందనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు బ్యూటీ హాఫ్ ఉన్నా.. లక్ ఉంటే సక్సెస్ అవుతుంటారు. లేదంటే గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకే అంకితం. చేతిలో ఆఫర్స్ ఉన్నవాళ్లు.. ఆఫర్స్ కోసం వేచి చూస్తున్న వాళ్ళందరూ ఇన్‌స్టాలో అందాన్ని ధారపోస్తున్నారు.
Updated on: Jul 05, 2025 | 1:33 PM

ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి.. కొన్ని నెలలుగా కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాతో పాటు.. అనగనగా ఒకరాజులో నటిస్తున్నారు మీనాక్షి. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ షో చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది.

కీర్తి సురేష్ సైతం ఈ మధ్య సోషల్ మీడియానే వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం మరోసారి హాట్ షో చేసారు కీర్తి. ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది. మరోవైపు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. ఉప్పు కప్పురంబు నేరుగా ఓటిటిలోకి వస్తుంటే.. ఆగస్ట్ 27న రివాల్వర్ రీటా, నెట్‌ఫ్లిక్స్‌లో అక్క సిరీస్‌లు క్యూలో ఉన్నాయి.

అవకాశాలు ఉన్నవాళ్లే కాదు.. వాటి కోసం చూస్తున్న వాళ్లకు ఇన్‌స్టాగ్రామ్ బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. రాశీ ఖన్నా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు.

అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి వచ్చిన షాలిని పాండే.. సింగిల్ సినిమా వండర్‌లా మారిపోయింది. అప్పట్నుంచి ఇన్‌స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు..

సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మరో బ్యూటీ నభా నటేష్. ప్రస్తుతం నిఖిల్‌తో స్వయంభులో నటిస్తున్నారు నభా. హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి సైతం సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా తమిళ ఇండస్ట్రీపైనే ఉంది. అక్కడ కార్తి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి ఆఫర్స్ ఉన్నోళ్లు.. లేనోళ్లు అందరి దారి సోషల్ మీడియానే.



















