- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes sons JayaKrishna, ntr, mokshagna movie entry details
ఇండస్ట్రీల్లో మొదలవనున్న వారసుల వార్.. మరెన్నో రోజులు లెవ్..
డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడో లేదో తెలియదు గానీ యాక్టర్ కొడుకు మాత్రం యాక్టర్ అవుతాడు. అది ఆనవాయితీ. వయసొచ్చిందంటే పదపద అంటూ పరిచయం అవుతుంటారు. తాజాగా ఇండస్ట్రీకి మళ్ళీ వారసుల తాకిడి కనిపిస్తుంది. తెలుగులోనే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ వారసులతో పాటు వారసురాళ్లు పరిచయం అవుతున్నారు. మరి వాళ్లెవరు..?
Updated on: Jul 05, 2025 | 1:16 PM

చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో వారసుల తాకిడి కనిపిస్తుంది. గాలి జనార్ధన్ తనయుడు కిరీటీ జూనియర్ అనే సినిమాతో భారీగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

కిరీటితో పాటు పరిచయం అవుతున్న మరో వారసుడు జయకృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు తనయుడు ఈయన. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోయే జయకృష్ణ సినిమాను RX100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

అలాగే నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ అన్నయ్య దివంగత జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయం అవుతున్నారు.. వైవిఎస్ చౌదరి ఈయన్ని హీరోగా పరిచయం చేయబోతున్నారు.

కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలోనూ వారసుల హవా కనిపిస్తుంది. మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ త్వరలో నటిగా పరిచయం కాబోతున్నారు.

‘తుడక్కం’ అనే చిత్రంతో ఈమె ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రానికి జూడే ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, పవన్ తనయుడు అకీరా నందన్ కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నారు.




