Tollywood: నా పెళ్లి గురించి మీకెందుకు.. ? మీరెందుకు అడుగుతున్నారు..? టాలీవుడ్ హీరోయిన్..
సాధారణంగా సినీతారల గురించి.. వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి నిత్యం ఏదోక వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా తన పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నలకు ఘాటుగా రియాక్ట్ అయ్యింది ఓ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Jul 05, 2025 | 12:31 PM

దశాబ్దకాలంగా సినీరంగంలో వరుస సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్ ఆమె. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో యంగ్, మీడియం హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ వెండితెరపై సందడి చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రెజీనా కసాండ్రా.

2005లో విడుదలైన తమిళ చిత్రం కండనాల్ మొదల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె నటించిన సినిమా అసురతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి సరైన ఆఫర్ రావడం లేదు.

కొన్ని రోజులుగా విభిన్న చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు సినిమాలతోపాటు వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. అలాగే విలన్ పాత్రలలోనూ అద్భుతమైన నటనతో అదరగొట్టేస్తుంది. ప్రస్తుతం రెజీనా వయసు 34 సంవత్సరాలు.

దీంతో ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తన పెళ్లి గురించి వస్తున్న కామెంట్స్ పై ముక్కు సూటిగానే ఆన్సర్ ఇచ్చింది. తాజాగా మరోసారి తన వివాహం గురించి వచ్చిన ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పెళ్లి గురించి తన తల్లే అడగడం లేదని అన్నారు.

రెజీనా మాట్లాడుతూ.. "నా పెళ్లి గురించి నా తల్లే అడగడం లదు.. మీరెందుకు అడుగుతున్నారు..? మీకెందుకు అంత అక్కర" అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం అని.. అందుకే ఫ్రెండ్ షిప్ ఈజీగా ఉంటుందని అన్నారు.




