- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines ananya pandey ashika ranganath bhagyashri borse's their songs are trending now even they are not doing movies
హీరోయిన్స్ కనుమరుగైన.. ఏ మాత్రం జోరు తగ్గని పాటలు
క్షణం తీరిక లేకుండా సౌత్ మొత్తం తిరిగే అవకాశాలు వీరిలో పుష్కలంగా ఉన్నాయనిపించుకున్న హీరోయిన్లు, ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్లు కనిపించినా, కనిపించకపోయినా, వాళ్ల సినిమాల్లోని పాటలను మాత్రం మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ పాట వింటే నందమూరి అభిమానులు పూనకాలు లోడింగ్ అంటారు.
Updated on: Sep 05, 2024 | 8:47 PM

క్షణం తీరిక లేకుండా సౌత్ మొత్తం తిరిగే అవకాశాలు వీరిలో పుష్కలంగా ఉన్నాయనిపించుకున్న హీరోయిన్లు, ఒకటీ అరా సినిమాలతో సరిపెట్టుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్లు కనిపించినా, కనిపించకపోయినా, వాళ్ల సినిమాల్లోని పాటలను మాత్రం మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఆడియన్స్.

ఈ పాట వింటే నందమూరి అభిమానులు పూనకాలు లోడింగ్ అంటారు. అంతగా పాపులర్ అయింది ఈ సాంగ్.వీరసింహారెడ్డిలో నందమూరి బాలకృష్ణగా మెప్పించిన చంద్రికా రవి మాత్రం ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

ఇలా ఒకే ఒక్క సినిమాలో కనిపించిన నాయికల లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారు అనన్య పాండే. లైగర్‌తో ఈ భామ వేరే లెవల్లో ఫేమ్ అవుతారని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ లైగర్ తర్వాత సౌత్ జర్నీ చేయనేలేదు అనన్య.

ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట రీమిక్స్ చూశాక ఆషికా రంగనాథ్ గురించి బాగానే ఊహించుకున్నారు తెలుగు జనాలు. టైర్2 హీరోలందరి పక్కనా కనిపిస్తారని కలలు కన్నారు. కానీ అడపాదడపా సీనియర్ హీరోల సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు ఈ బ్యూటీ.

పెట్టినమ్మ కొట్టినా ఫర్వాలేదనే మాట సినిమా ఇండస్ట్రీలో పనికిరాదు. తనకు మితిమీరిన ఫేమ్ తెచ్చిన మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినప్పుడు ఈ విషయం బాగా తెలిసొచ్చింది భాగ్యశ్రీ బోర్సేకి. ఈ బ్యూటీ నెక్స్ట్ ప్రాజెక్టు రిలీజ్ అయితేగానీ.. ఫ్యూచర్ ఏంటన్నది తెలియడం లేదిప్పుడు...




