Rajeev Rayala |
Updated on: Jun 01, 2024 | 9:14 PM
ఈషా రెబ్బ.. ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. సరైన సినిమా పడితే హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.
చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది ఈషా రెబ్బ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఇటీవలే అరవింద సమేత సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాలో తన పాత్ర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది ఈషా రెబ్బ. ఇక ఇప్పుడు కొత్త ఆఫర్స్ అందుకునేలా సోషల్ మీడియాలో ఫొటోలతో అదరగొడుతోంది.
తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చూడముచ్చటగా ఉంది ఈషరెబ్బ. ఈ చిన్నదాని సోయగానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.