- Telugu News Photo Gallery Cinema photos Tiger Nageswara Rao Movie to Ramcharan latest movie Updates from industry
Movie Updates: సెన్సార్ పూర్తిచేసుకున్న టైగర్.. ఫారిన్ ట్రిప్ లో రామ్ చరణ్..
నిన్నమొన్నటి వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో ఫారిన్ ట్రిప్ వెళ్లారు. 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కీడా కోలా. డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సెన్సార్ పూర్తైంది.
Updated on: Oct 19, 2023 | 2:01 PM

నిన్నమొన్నటి వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ ట్రిప్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తన ముద్దుల తనయ క్లీంకారకు తొలి ఫారిన్ ట్రిప్ ఇదే కావడం గమనార్హం. ఎయిర్ పోర్టులో కూతురుతో చరణ్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల్లో వాళ్ల పెట్ డాగ్ రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఉన్నారు.

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కీడా కోలా. కొన్నేళ్లుగా దర్శకుడిగా కంటే నటుడిగా బిజీ అయిన ఈయన.. కొంత గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. కీడా కోలాలో నటిస్తూ దర్శకత్వం వహించారు తరుణ్ భాస్కర్. చైతన్య రావు, బ్రహ్మానందం ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన టిల్లు స్క్వేర్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే తాజాగా తెలుసు కదా సినిమాను మొదలు పెట్టారు సిద్ధూ. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా, లిరిక్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి.

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. మారేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది అలా నిన్ను చేరి.

టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సెన్సార్ పూర్తైంది. దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రం 3 గంటలకు పైగా నిడివితో వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. టైగర్ నాగేశ్వరరావు ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 52 నిమిషాలు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.




