Faria Abdullah: గత్తరలేపిన చిట్టి.. ఏం వయ్యారం రా బాబు అంటున్న నెటిజన్స్
హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.
Updated on: Nov 09, 2025 | 1:44 PM

హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది.

కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. ఈ సినిమాతో సెకండ్ హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ మధ్యకాలంలో తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు. సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ అమ్మడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అరాచకం చేస్తుంది ఈ వయ్యారి భామ.

తాజాగా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచి కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.