- Telugu News Photo Gallery Cinema photos Family Man Fame actress priyamani shared her latest photos goes viral
కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫొటోస్ అదుర్స్
18 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
Updated on: Nov 09, 2025 | 1:50 PM

18 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2003లో ఎవరే అతగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2007లో తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇక మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.

అయితే కొన్నాళ్లు తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన ప్రియమణి 2013లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో కనిపించింది. ఇందులో షారుఖ్ ఖాన్ తో కలిసి 1234 అనే స్పెషల్ సాంగ్ తో ఇరగదీసింది. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్, ఆర్టికల్ 370 వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

2017లో ప్రియమణి ఈవెంట్ మేనేజర్ నుండి సినిమా డైరెక్టర్‌గా మారిన ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకుంది. తాను మతాంతర వివాహం చేసుకోవడం వల్ల తనకు అనేక బెదిరింపులు వచ్చాయని తెలిపింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఆమె చివరిగా నటించిన సినిమా ‘ఆఫికల్ ఆన్ డ్యూటీ’ ఫిబ్రవరి 20, 2025న విడుదలైంది. ఇందులో కుంచాకో బోబన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ చిన్నది చీరకట్టులో నెటిజన్స్ మతి పోగొడుతుంది. తాజాగా మరోసారి చీరకట్టులో అదరగొట్టింది ఈ అమ్మడు.




