మిస్టర్ ఉప్పీ.. అదేనండీ ఉపేంద్ర అనగానే మనకు ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా గుర్తుకొచ్చేస్తాయి కదా. చేసిన సినిమాలు అనగానే, యాక్ట్ చేసిన సినిమాలు... అనే కదా అనుకుంటాం! కానీ ప్రశాంత్ నీల్‌కి మాత్రం ఉప్పీ యాక్ట్ చేసిన సినిమాలు గుర్తు రావట. ఉపేంద్ర డైరక్ట్ చేసిన సినిమాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయట. ఆయన విజన్, ఆయన డైరక్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అంటారు ప్రశాంత్ నీల్. తనను మొదటి నుంచీ కన్నడ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేసింది కాబట్టి ఈ మాట చెప్పడం లేదని అంటారు ప్రశాంత్. మనస్ఫూర్తిగా ఉపేంద్ర సినిమాలను ఇష్టపడతానని, ఏ స్టేజ్ మీదయినా ఇదే విషయాన్ని చెబుతానని అన్నారు సలార్ కెప్టెన్.