- Telugu News Photo Gallery Cinema photos Raashi Khanna to lady super star Nayanthara latest film news from cinema industry
Heroines: రాశీ ఆశలన్నీ యోధ మీదే! బిల్లాకి నయన్ ఎందుకు ఓకే చెప్పారంటే.?
పక్కమీద పడుకుని పగటి కలలు కంటున్నా అని అంటున్నారు బొద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ మధ్య నార్త్ లోనే బిజీగా ఉన్నారు రాశీఖన్నా. ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. కానీ, ఆడిషన్స్ ఇచ్చేవారి ప్రయత్నాలు మాత్రం ఎక్కడో ఓ చోట ఆగితే బావుంటుందనిపిస్తుంది. అన్నీ సినిమాలనూ డబ్బుల కోసం ఒప్పుకోరు నటీనటులు. కొన్ని సినిమాల విషయంలో లాజిస్టిక్స్ పనిచేసినా, కొన్ని మూవీస్ మాత్రం లాజికల్‌గా నిలబడుతాయి.
Updated on: Feb 28, 2024 | 3:05 PM

పక్కమీద పడుకుని పగటి కలలు కంటున్నా అని అంటున్నారు బొద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ మధ్య నార్త్ లోనే బిజీగా ఉన్నారు రాశీఖన్నా. ఇప్పుడు కూడా ఆమె యోధ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమా యోధ. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు రాశీ.

త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు రాశీ. గతేడాది ఫర్జి ఎంత పెద్ద విజయం సాధించిందో, ఈ ఏడాది యోధ అంతకన్నా పెద్ద హిట్ కావాలన్నది రాశీ ఖన్నా మనసులో ఉన్న మాట. ఆ సినిమా ఎలాగూ సౌత్ రిలీజ్ అవుతుంది కాబట్టి, పనిలో పనిగా దక్షిణాది ఆడియన్స్ ని కూడా పలకరించినట్టు అవుతుందని అంటున్నారు రాశీ.

ఎవరైనా ప్రయత్నాలు చేస్తుంటే ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. కానీ, ఆడిషన్స్ ఇచ్చేవారి ప్రయత్నాలు మాత్రం ఎక్కడో ఓ చోట ఆగితే బావుంటుందనిపిస్తుంది. ఈ స్టేట్‌మెంట్‌ని నెగటివ్ సెన్స్ లో తీసుకునేరు... ఇక్కడ అంతా పాజిటివేనండోయ్. ఆడిషన్స్ ట్రయల్స్ ఆగడమంటే మంచి అవకాశం రావడం అని అర్థం. రమన్ రాఘవ్ 2.0 సినిమాకు సెలక్ట్ కావడం వల్ల, తాను మరో వెయ్యి ఆడిషన్స్ ఇవ్వకుండా ఆగానని అంటున్నారు శోభిత దూళిపాళ. ఆ ప్రాజెక్ట్ తన మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించిందని అన్నారు. తనకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌లు లేరని చెప్పారు. తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడం వల్ల, హావభావాల మీద నమ్మకంతో ఆడిషన్స్ కి వెళ్లినట్టు తెలిపారు.

అన్నీ సినిమాలనూ డబ్బుల కోసం ఒప్పుకోరు నటీనటులు. కొన్ని సినిమాల విషయంలో లాజిస్టిక్స్ పనిచేసినా, కొన్ని మూవీస్ మాత్రం లాజికల్‌గా నిలబడుతాయి. తన కెరీర్‌లో బిల్లా చేయడానికి ఓ లాజిక్ ఉందని అంటున్నారు నయనతార. అజిత్ హీరోగా విష్ణువర్ధన్ డైరక్షన్‌లో తెరకెక్కిన సినిమా బిల్లా.

విష్ణు ఈ కథను నెరేట్ చేసేటప్పుడే... బికినీ సీన్ గురించి చెప్పారట. అల్ట్రా గ్లామరస్‌గా ఉంటుందని కూడా అన్నారట. అయితే, అప్పటిదాకా ఈ రేంజ్ గ్లామరస్ కేరక్టర్లు చేయలేదు నయన్. అందుకే తనలోని గ్లామర్ యాంగిల్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆఫ్టర్ బిల్లా, తనను అప్రోచ్ అయ్యే డైరక్టర్ల మైండ్‌సెట్ మారిపోవడాన్ని స్పష్టంగా గమనించానని అంటున్నారు లేడీ సూపర్ స్టార్.




